మీ పిల్లలు హైట్ పెరగాలా? అయితే ఈ రోజు నుంచే వీటిని తినిపించండి

First Published | Nov 10, 2023, 1:45 PM IST

తల్లిదండ్రులు పిల్లల ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మంది పిల్లలు ఆరోగ్యకరమైనవే తిన్నా .. హైట్ మాత్రం అస్సలు పెరగరు.అయితే పిల్లల పొడవు వారి తల్లిదండ్రుల పొడవుపై కూడా ఆధారపడి ఉంటుంది. కానీ పిల్లలకు కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే వారు హైట్ బాగా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. 
 

foods for kids

పిల్లల ఎదుగుదలలో ఫుడ్ కీలక పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపిస్తే పిల్లల ఆరోగ్యం, ఎత్తు రెండూ బాగుంటాయి.  అయితే జన్యుపరమైన కారణాల వల్ల కూడా పిల్లలు హైట్ పెరిగే అవకాశం ఉంది. మీ పిల్లలు తక్కువ ఎత్తుతో బాధపడుతుంటే వారి రోజువారి ఆహారంలో వీటిని చేర్చండి. ఎందుకంటే ఇవి మీ పిల్లల ఎత్తును పెంచేందుకు సహాయపడతాయి. 

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు పోషకాలకు మంచి వనరులు. మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే వారికి పాలు, పెరుగు, జున్ను వంటి వాటిని తినిపించండి. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అంతేకాదు వీటిలో కాల్షియం, ప్రోటీన్ కూడా ఉంటాయి. ఇవి పిల్లల హైట్ ను పెంచేందుకు సహాయపడతాయి. చాలా సార్లు శరీరంలో పోషకాలు లోపించడం వల్ల పిల్లలు ఎత్తు పెరగరు. అందుకే మీ పిల్లలు తినే ఆహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చాలి. 
 


గుడ్లు

గుడ్లు ప్రోటీన్ కు అద్బుతమైన మూలం. వీటిలో విటమిన్ బి2 ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ పిల్లల హైట్ ను పెంచేందుకు సహాయపడుతుంది. మీ పిల్లలు హైట్ పెరగాలనుకుంటే వారి రోజువారి ఆహారంలో గుడ్లను ఖచ్చితంగా చేర్చండి. ఇవి మీ పిల్లల హైట్ ను పెంచడమే కాకుండా.. ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 
 

సోయాబీన్

సోయాబీన్స్ శాఖాహారులకు మంచి ప్రోటీన్ వనరు. వీటిలో ఉండే పోషకాలు ఎముకలను బలంగా చేస్తాయి. అలాగే పిల్లలు పొడవు పెరిగేందుకు సహాయపడతాయి. 
 

అరటిపండు

అరటిపండులో పోషకాలు పుష్కలగా ఉంటాయి. పిల్లలు రోజూ అరటిపండును తింటే హైట్ పెరిగే అవకాశం ఉంది. ఈ పండులో కాల్షియం, పొటాషియం, మాంగనీస్, కరిగే ఫైబర్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పండు తక్షణ ఎనర్జీని అందిస్తుంది. పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

చేపలు

చేపలు కూడా పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఇనుము, కాల్షియం, భాస్వరం, సెలీనియంతో పాటుగా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. చేపలను తిన్నా పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. 

leafy vegetables

ఆకుకూరలు

ఆకు కూరలను తిన్నా పిల్లలు హైట్ పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఆకు కూరలు పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. 

Latest Videos

click me!