టమాటాలను తినట్లేదా? అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే..!

First Published Jul 31, 2023, 4:36 PM IST

టమాటాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

టమాటాలను శాస్త్రీయంగా సోలనం లైకోపెర్సికమ్ అని పిలుస్తారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వంటకాల్లో ఉపయోగిస్తారు. టమాటాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాల్లో విటమిన్లు, ఖనిజాలు, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా క్యాన్సర్ తో పోరాడటానికి ఎంతో సహాయపడతాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అసలు టమాటాలను తింటే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాలకు గొప్ప మూలం

టమాటాలు పోషకాలకు మంచి వనరు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి విటమిన్లు, థియామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు వీటిలో పొటాషియం, మాంగనీస్,  క్రోమియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. టమాటాలు డైటరీ ఫైబర్ కు కూడా అద్భుతమైన మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు గట్ ను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

Latest Videos


గుండె ఆరోగ్యం

టమాటాల్లో ఉండే లైకోపీన్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. లైకోపీన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. టమాటాలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 

tomatoes

క్యాన్సర్ ను నివారించే లక్షణాలు

టమాటాల్లో క్యాన్సర్ ను నివారించే లక్షణాలు కూడా ఉంటాయి. వీటిలో ఉండే లైకోపీన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుందని అధ్యయనం వెల్లడిస్తోంది. టమాటాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి, కణాల నష్టాన్ని నివారించడానికి సహాయపడతాయి. 
 

tomatoes

చర్మ ఆరోగ్యం 

టమాటాలు చర్మ ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి. టమాటాల్లో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే చర్మాన్ని దృఢంగా, యవ్వనంగా ఉంచుతుంది. టమాటాలలోని లైకోపీన్,  బీటా కెరోటిన్ చర్మాన్ని యూవీ కిరణాలతో దెబ్బతినకుండా రక్షిస్తాయి. అలాగే వడదెబ్బ ప్రమాదాన్ని, అకాల వృద్ధాప్యం సంకేతాలను తగ్గిస్తాయి. దీనిలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మొటిమలు, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Image: Getty Images

కంటి ఆరోగ్యం

టమాటాల్లో విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. టమాటాల్లో ఉండే లుటిన్, జియాక్సంతిన్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి కంటిచూపును మెరుగుపరుస్తాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత, కంటిశుక్లం నుంచి కళ్లను రక్షిస్తాయి.
 

వెయిట్ లాస్

టమాటాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తీసుకోవడం తగ్గాలంటే మీ రోజువారి ఆహారంలో టమాటాలను ఖచ్చితంగా చేర్చండి. ఇవి మీ కడుపును తొందరగా నింపుతాయి. టమాటాల్లో ఉండే ఫైబర్ మీ ఆకలిని తగ్గిస్తుంది. 

click me!