weight loss
ఊబకాయం ప్రస్తుతతం చాలా మందిని వేధిస్తున్న సర్వసాధారణ సమస్య. మీకు తెలుసా? కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. అయితే కేలరీలు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. మనం తినే ప్రతిదానిలో కేలరీలు ఉంటాయి. అయితే ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో సాధారణంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే మనకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. బరువు తగ్గడానికి కేలరీలు తక్కువగా ఉండే కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బెర్రీలు
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, కోరిందకాయలు వంటి అర కప్పు బెర్రీల్లో 32 కేలరీలను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
Image: Getty Images
ఆపిల్స్
100 గ్రాముల ఆపిల్స్ లో 50 కేలరీలు ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్ లో పెక్టిన్ చాలా ఉంటుంది. దీనిలో ఉండే కరిగే ఫైబర్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
బొప్పాయి
బొప్పాయి బరువు తగ్గడానికి బొప్పాయి కూడా ఎంతో సహాయపడుతుంది. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. బొప్పాయిలో డైజెస్టివ్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. ఒక కప్పు బొప్పాయిలో 62 కేలరీలు మాత్రమే ఉంటాయి.
నారింజ
నారింజలో సహజంగా కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు బరువు తగ్గడంతో సంబంధం కలిగి ఉంటాయి. ఒక నారింజలో 45 కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
కివీ
బరువు తగ్గాలనుకునే వారు కివీ పండును రెగ్యులర్ డైట్ లో చర్చుకోవచ్చు. ఈ పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కివీ పండ్లలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండు ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.