ఈ కూరగాయలు తింటే మీ లివర్ సేఫ్..!

First Published | Jul 28, 2023, 4:24 PM IST

మన కాలెయం ఆరోగ్యం దెబ్బతింటే శరీరం మొత్తం  ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే కాలెయాన్ని ఆరోగ్యంగా  ఉంచుకోవడం చాలా ముఖ్యం.
 

liver

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలెయం ఒకటి. కాలేయ ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే కామెర్లు నుంచి కొవ్వు కాలేయ సిండ్రోమ్ వరకు మన కాలెయాన్ని ఎన్నో వ్యాధులు దెబ్బతీస్తాయి. కాలేయం ఆరోగ్యం దెబ్బతింటే అది శరీరం మొత్తం ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే కాలెయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అయితే కొన్ని కూరగాయలు మన కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అవేంటంటే.. 

బీట్ రూట్

బీట్ రూట్ లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉండే బీట్ రూట్ మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఇవి మన కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాలెయ పనితీరును మెరుగుపరుస్తాయి. 
 


బ్రోకలీ

బ్రోకలీలో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కూరగాయ మన కాలేయంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. బ్రోకలీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర మొత్తం ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
 

cauliflower

క్రూసిఫరస్ కూరగాయలు

క్రూసిఫరస్ కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. ఈ కూరగాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ బి5, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ఐరన్, క్యాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంయగా ఉంచుతాయి. 

క్యాబేజీ

క్యాబేజీ కూడా క్రూసిఫరస్ కూరగాయ. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి లతో పాటుగా మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ లు కూడా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 
 

Latest Videos

click me!