జొన్నలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో..!

First Published | Jun 24, 2023, 2:42 PM IST

జొన్నలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో గ్లూటెన్ మొత్తమే ఉండదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, డయాబెటిస్ రోగులకు జొన్నలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో బయోయాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని  ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి జొన్నల ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ఫైబర్ తో పాటుగా జొన్నలో నిరోధక స్టార్చ్, సెల్యులోసిక్, నాన్ సెల్యులోసిక్ పాలిసాకరైడ్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఫినోలిక్ సమ్మేళనాలు ప్రధానంగా ఫినోలిక్ ఆమ్లాలు, ఆంథోసైనిడిన్లు, టానిన్లతో కూడి ఉంటాయి. దీనిలో 3డి ఆంథోసైనిన్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది 

నిపుణుల ప్రకారం.. జొన్నలు  డైటరీ ఫైబర్ కు మంచి వనరు. ఈ ఫైబర్ జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఇతర జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్ గట్ బ్యాక్టీరియాకు ప్రీబయోటిక్ గా పనిచేస్తుంది.
 


కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలు 

జొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జొన్నలోని యాంటీఆక్సిడెంట్ ఫినోలిక్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫైటోస్టెరాల్స్ , పాలీకోసానాల్ కొలెస్ట్రాల్ శోషణ, విసర్జన, సంశ్లేషణను ప్రోత్సహిస్తాయి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

బరువు తగ్గడానికి 

స్థూలకాయులకు తృణధాన్యాలుగా జొన్నలు అద్భుతమైన ఆహారం. ఇది కడుపును నిండుగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. జొన్నల్లో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ తక్కువ స్థాయి కొలెస్ట్రాల్ తో ముడిపడి ఉంది. ఇది గుండె జబ్బులు, అథెరోస్క్లెరోసిస్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
 

డయాబెటిస్ 

జొన్నల్లో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గ్లూకోజ్ ను తగ్గించే లేదా హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే  రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న జొన్నల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 
 

ఎముకల ఆరోగ్యం

జొన్నలు కాల్షియం శోషణను ప్రోత్సహిస్తాయి. జొన్నలో  మెగ్నీషియం కంటెంట్  ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం శోషణలో, కొత్త ఎముక కణజాలం అభివృద్ధిలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మీరు మెగ్నీషియం లోపంతో బాధపడుతుంట మీ శరీరం ఎముకల నుంచి ఖనిజాలను బయటకు పంపుతుంది. మెగ్నీషియం, కాల్షియం లేకపోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జొన్న ఫైటోకెమికల్స్ క్యాన్సర్ నిరోధకతను కలిగి ఉంటాయి. అధిక పాలీఫెనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
 

Latest Videos

click me!