గుడ్లను ఈ విధంగా తిన్నారంటే తొందరగా బరువు తగ్గుతారు

First Published | Oct 13, 2023, 4:30 PM IST

గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని సరైన పద్ధతిలో, సరైన సమయంలో తింటే చాలా సులువుగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఇది మీకు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. 

గుడ్లు మంచి పోషకాహారం.  వీటిని రోజూ తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్ల రెసిపీని తయారుచేయడం చాలా సులువు కూడా. ఆమ్లెట్, ఉడికించి ఇలా గుడ్లను ఎన్నో విధాలుగా తినొచ్చు. గుడ్లు ప్రోటీన్, కాల్షియం, ఎన్నో రకాల విటమిన్లు, ఇతర పోషకాలకు మంచి వనరు. గుడ్లు మీ బరువును తగ్గించడమే కాకుండా మీ మొత్తం శరీరాన్ని  ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం గుడ్లను ఎప్పుడు, ఎలా తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుడ్లలోని పోషకాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రపంచ గుడ్ల దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటారు.

వరల్డ్ ఎగ్ డే 

1996 నుంచి అంతర్జాతీయ గుడ్డు కమిషన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ శుక్రవారం ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. ప్రపంచ గుడ్ల దినోత్సవాన్ని ఈ ఏడాడి అక్టోబర్ 13న జరుపుకుంటున్నాం. గుడ్లలోని పోషక విలువల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రపంచ గుడ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
 

Latest Videos



గుడ్లలోని పోషకాలు 

గుడ్డు సంపూర్ణ ఆహారం. ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో సుమారు 77 కేలరీలు ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ బి 5, విటమిన్ బి 12, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం, జింక్, ఆరు గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటాయి. గుడ్లు ప్రోటీన్ కు మంచి మూలం. వీటిలో గుండెకు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. ఇది విటమిన్ బి 6, విటమిన్ బి 12, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలకు గొప్ప మూలం.
 

egg

మంచి కొలెస్ట్రాల్, కోలిన్ మూలం

గుడ్లను తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలువబడే అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లెవెల్ పెరుగుతుంది. ఎక్కువ హెచ్డిఎల్ స్థాయిలు ఉన్నవారికి గుండె జబ్బులు, స్ట్రోక్ , ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆరు వారాల పాటు ప్రతిరోజూ రెండు గుడ్లను తినడం వల్ల హెచ్డిఎల్ స్థాయిలు 10% వరకు పెరుగుతాయి. గుడ్లు కోలిన్ కు మంచి మూలం. ఇది మెదడులో సిగ్నలింగ్ అణువుల ఉత్పత్తికి సహాయపడుతుంది.
 

గుడ్లు ఎప్పుడు తినాలి?

గుడ్లతో ఉత్తమ ఫలితాలను పొందడానికి మీరు దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తినాలి. ఇది మన శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది. అలాగే మీ కడుపును తొందరగా నింపుతుంది. అంతేకాదు ఉదయాన్నే జీర్ణవ్యవస్థ ఉత్తమంగా పనిచేస్తుంది. గుడ్డులో ఉన్న ప్రోటీన్లు, ఇతర పోషకాలను జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. 
 

బరువు తగ్గడానికి గుడ్లు ఎలా తినాలి? 

తక్కువ వేడి వద్ద వంట చేయడం వల్ల కొలెస్ట్రాల్ ఆక్సీకరణ తగ్గుతుంది. ఇది గుడ్డులోని చాలా పోషకాలను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఈ కారణంగా ఉడికించిన గుడ్లు తినడానికి మంచివి. 
 


ఉడికించిన గుడ్లు

ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల కూడా అనవసరమైన కేలరీలు పెరగవు. గుడ్లను ఉడికించడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది. గుడ్లను నీటిలో 6-10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఎక్కువ సేపు ఉడికించడం వల్ల పచ్చసొన గట్టిపడుతుంది.
 

ఆమ్లెట్ 

ఎగ్ ఆమ్లెట్ నచ్చని వారు ఎవ్వరూ ఉండరు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలతో దీన్ని తయారుచేసుకుని తింటే బలే టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారుచేయడం చాలా సులువు. గుడ్డు ఆమ్లెట్ తిన్నా మీరు దీని ప్రయోజనాలను పొందుతారు. 

మైక్రోవేవ్ లో వండడం 

గుడ్లను వండడానికి మైక్రోవేవ్లను ఎన్నో రకాలుగా ఉపయోగించొచ్చు. గుడ్లను స్టవ్లో కంటే మైక్రోవేవ్లో ఉడికించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. మైక్రోవేవ్లో గుడ్లను వండటం ఆరోగ్యకరమైన మార్గం కాదు.

click me!