ఈ నల్ల గింజలు ఎన్నో రోగాలను తగ్గిస్తయ్ తెలుసా?

First Published | Jul 23, 2023, 3:29 PM IST

కలోంజి లేదా నల్ల విత్తనాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిలో ఉండే పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

నిగెల్లా సీడ్స్ అని కూడా పిలువబడే కలోంజి వంటకాలకు మంచి సువాసనను జోడిస్తుంది. అంతేకాదు రుచిగా కూడా చేస్తాయి. ఈ బ్లాక్ సీడ్స్ లో విటమిన్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలతో పాటుగా మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. అసలు ఈ బ్లాక్ సీడ్స్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

pimples


చర్మ సమస్యలకు..

వర్షాకాలంలో ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి. సోరియాసిస్ లేదా మొటిమల సమస్యలు ఎక్కువవుతుంటాయి. అయిే కలోంజి లేదా నల్ల విత్తనాలు వీటి లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఈ చర్మ సమస్యలను దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది సోరియాసిస్, మొటిమల లక్షణాలను మెరుగుపరచడానికి, బొల్లి గాయాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎవిడెన్స్-బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. చర్మ సమస్యలను పరిష్కరించడానికి కలోంజి తినడం ప్రయోజనకరంగా ఉంటాయని కనుగొన్నారు.


బరువు తగ్గడానికి.. 

ఈ బ్లాక్ సీడ్స్ బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఈ నల్ల విత్తనాలలో కొవ్వును తగ్గించడానికి సహాయపడే క్రియాశీల పదార్థాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. డోవ్ప్రెస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం కలోంజిలోని క్రియాశీల పదార్థాలు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయని కనుగొన్నారు. 
 

thyroid

 థైరాయిడ్ కోసం..

థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ గ్రంథి. ఇది జీవక్రియను నిర్వహించడానికి సహాయపడే హార్మోన్లను తయారు చేసి విడుదల చేస్తుంది. ఇది సరిగ్గా పనిచేయనప్పుడు హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. మీ ఆహారంలో కలోంజిని చేర్చడం వల్ల మీ థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుంది. నల్ల విత్తనాలను తినడం వల్ల టిఎస్హెచ్, థైరాయిడ్ ప్రతిరోధకాలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Cholesterol

కొలెస్ట్రాల్ కోసం.. 

అధిక కొలెస్ట్రాల్ ఒక సాధారణ సమస్య. ఇది గుండెపోటు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, మరెన్నో ఆరోగ్య సమస్యలొచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. అయితే  కలోంజి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది. 
 

diabetes

రక్తంలో చక్కెర స్థాయిల కోసం.. 

బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి కూడా కలోంజీ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. మీ ఆహారంలో కలోంజీ విత్తనాలను జోడించడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని కనుగొన్నారు.

Latest Videos

click me!