రోజూ పల్లీలను తింటే..!

First Published | Jul 22, 2023, 4:26 PM IST

వేరుశెనగ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహాయపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. 
 

బాదం, వాల్ నట్స్ లేదా జీడిపప్పు వంటి గింజల లాగ పల్లీల్లో పోషకాలు ఎక్కువగా ఉండవని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే.. వేరుశెనగలు కూడా చాలా ఖరీదైన గింజల మాదిరిగానే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. 
 

వేరుశెనగలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రోజూ పల్లీలను లిమిట్ లో తింటే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 
 


వేరు శెనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ  మొత్తంలో ఉంటాయి. ఇలాంటి వేరుశెనగ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. వేరుశెనగ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలదని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. పల్లీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలనే తినాలి. వేరుశెనగలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అందుకే మధుమేహులు వీటిని మోతాదులో తింటే మంచి ప్రయోజనాలను పొందుతారు. 
 

వేరుశెనగలో పుష్కంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వేరుశెనగ తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా వేరుశెనగలను తినొచచ్చు. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

వేరుశెనగ తినడం వల్ల కూడా ఎక్కువ కాలం బతుకుతారని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా ఏవైనా గింజలు (వేరుశెనగతో సహా) తినే వ్యక్తులు అరుదుగా గింజలు తినే వ్యక్తుల కంటే ఏ కారణంతోనైనా చనిపోయే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
 

వేరుశెనగలో  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిని తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. వేరుశెనగ తినడం వల్ల మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

వేరుశెనగ ఫైబర్ కంటెంట్ కు మంచి మూలం. ఇది మీ శరీరమంతా మంటను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇది మీ జీర్ణవ్యవస్థకు కూడా సహాయపడుతుంది. అయితే వృద్ధులు వేరుశెనగ వెన్న తినడం గ్యాస్ట్రిక్ నాన్ కార్డియా అడెనోకార్సినోమా అని పిలువబడే ఒక నిర్దిష్ట రకమైన కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఒక పరిశోధనలో తేలింది.
 

వేరుశెనగ ఆరోగ్యకరమైన ఆహారమే.. అయినప్పటికీ.. వీటిని కొందరు తినకూడదు. ముఖ్యంగా వేరుశెనగ అలెర్జీ ఉన్నవారు.  వేరుశెనగ అలెర్జీ దురద, దద్దుర్లు, వికారం లేదా ముఖం వాపురావడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అయినప్పటికీ తీవ్రమైన వేరుశెనగ అలెర్జీ అనాఫిలాక్సిస్ అని పిలువబడే ప్రాణాంతక సమస్యకు కారణమవుతుంది. అనాఫిలాక్సిస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే వికారం, వాంతి వచ్చేలా ఉండటం, మూర్ఛ, ఛాతీ నొప్పి, నాలుక, ముఖం లేదా పెదవుల వాపు, విపరీతమైన మగత, మైకము, గందరగోళం లేదా తేలికపాటి తలనొప్పి దీని లక్షణాలు.

Latest Videos

click me!