చిలగడదుంపలను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 19, 2023, 1:46 PM IST

చిలగడదుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని తరచుగా తినాలంటుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే వీటిని రోజూ తింటే ఏం కాదా? 
 

చిలగడదుంపలు తీయగా, ఎంతో టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. చిలగడదుంపల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కు9వగా ఉంటాయి. వీటిని తింటే బరువు పెరిగిపోతామన్న భయం కూడా ఉండదు. నిజానికి ఇవి మనం బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి.  100 గ్రాముల చిలగడదుంపల్లో 86 కేలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే వీటిలో ప్రోటీన్, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, బరువును నియంత్రణలో ఉంచడానికి బాగా సహాయపడతాయి.

చిలగడదుంపల్లో ఫైబర్ తో పాటుగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ బి6 కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి చిలగడదుంపలను తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చిలగడదుంపలు మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. చిలగడదుంపలను రోజూ తింటే ఎసిడిటీ,  కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గిపోతాయి. చిలగడదుంపలు మన పొట్ట ఆరోగ్యానికి కూడా ప్రయోజకరంగా ఉంటాయి. 

Latest Videos


చిలగడదుంపలో విటమిన్ సి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు సహాయపడుతుంది. అలాగే మన ఎముకలు, దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ చిలగడదుపంల్లో విటమిన్ ఎ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే వీటిని తింటే మన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సమస్యలకు దూరంగా ఉంటారు. చిలగడదుంపలను తింటే వృద్ధాప్యం వల్ల వచ్చే దృష్టి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. 

Image: Getty Images

డయాబెటీస్ పేషెంట్లు కూడా చిలగడదుంపలను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి. అయినా వీటిలో నేచురల్ షుగర్ ఉంటుంది. అందుకే మధుమేహులు వీటిని మోతాదులోనే తినాలి. చిలగడదుంపల్లో ఉండే బీటా కెరోటిన్ చర్మంపై ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

click me!