మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అందుకే ఆరోగ్య నిపుణులు సమతుల్య, పోషకాహారాన్ని తినాలని సలహానిస్తుంటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయలు ఎన్నో ఉన్నాయి. వీటిలో బీరకాయ ఒకటి. బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. బీరకాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..