అంజీరను తింటే ఎన్ని లాభాలున్నాయో..!

First Published | Jun 27, 2023, 4:24 PM IST

అంజీర మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది.  కానీ వీటిని తినే వారు చాలా తక్కువే. మీకు తెలుసా? వీటిని తింటే రక్తపోటు సమస్యలతో పాటుగా ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది.  
 

figs

అంజీర లేదా అత్తి పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పండ్లలో ఒకటి. అంజీర పండ్లు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఈ పండ్లలో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, కాల్షియం, కాపర్, పొటాషియం, విటమిన్ కె వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. 

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా  ఉండే అత్తి పండ్లు మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడతాయి. ఈ పండ్లు మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి గట్ ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవిమీ  గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా సహాయపడతాయి.


క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండే అంజీర్ పండ్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అత్తిపండ్లు పొటాషియానికి మంచి మూలం. కాబట్టి ఈ పండ్లు అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే బీపీ సమస్యలు ఉన్నవారు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు అంజీర పండ్లను తమ  ఆహారంలో చేర్చుకోవాలి. 

dried figs

అత్తి పండ్లలో  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటుంది. నానబెట్టిన అంజీర పండ్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన అత్తి పండ్లను తినడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే మలబద్దకం సమస్య కూడా పోతుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

Latest Videos

click me!