యాలకులను తింటే ఇన్ని లాభాలా?

First Published | Jun 26, 2023, 12:08 PM IST

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ యాలకులను తింటే బరువు తగ్గడం నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. 
 

cardamom

యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో ఏండ్ల నుంచి వంటల్లో ఉపయోగిస్తున్నాయి. యాలకులు ఫుడ్ రుచిని పెంచడమే కాదు.. దానికి కమ్మని వాసనను కూడా ఇస్తుంది. దీని రుచి ఎన్నో శారీరక సమస్యలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. రీసెర్చ్ గేట్ ప్రకారం.. మసాలా దినుసుల రాణిగా పిలువబడే చిన్న యాలకులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిని కేరళ, కర్ణాటక, తమిళనాడులో పండిస్తారు. వీటిని తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది.  ఎడిఎంఎసి ఆంకాలజీ ప్రకారం.. యాలకులలో ఉండే యాలకుల మూలకం రొమ్ము, కొలొరెక్టల్ క్యాన్సర్ తో సహా ఎన్నో రకాల క్యాన్సర్లలో కీమో నివారణ ఏజెంట్ గా పనిచేస్తుంది.

cardamom

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మధుమేహం, ఒత్తిడి, కాలేయ సమస్యలు, క్యాన్సర్ తో సహా ఎన్నో రోగాల ముప్పును తగ్గిస్తాయి. అంతేకాదు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి కూడా. యాలకులు దంతాలలో ఉండే బ్యాక్టీరియాను తగ్గించి నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాలకుల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 


అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

ఈ చిన్న యాలకులు కూడా అధిక రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఒక పరిశోధన ప్రకారం.. 3 గ్రాముల యాలకుల పొడిని 20 మంది మూడు వారాల పాటు మూడుసార్లు తీసుకున్నారు. దీని తర్వాత వారి రక్తపోటులో గణనీయమైన మార్పు వచ్చింది. యాలకులు మూత్రవిసర్జన ప్రభావంతో అంటే శరీరంలోని నీటిని మూత్రం ద్వారా తొలగించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధనలో తేలింది.
 

cardamom

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

యాలకులను తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, కడుపునొప్పి, చికాకు వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు దూరం అవుతాయి. దీనిలో ఉండే బయోయాక్టివ్ పదార్థాలు శరీరంలోని జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకులను తినడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్లు 50 శాతం తగ్గుతాయని ఎన్సీబీఐ అధ్యయనంలో తేలింది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి యాలకులు నమలాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పదార్థాలు ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడతాయి.
 

నోటి దుర్వాసన

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండే చిన్న యాలకులను తినడం వల్ల నోటి దుర్వాసన సమస్య పోతుంది. ఇందుకోసం యాలకుల పొడిని నీటిలో మరిగించి తాగితే సమస్య పరిష్కారం అవుతుంది. రీసెర్చ్ గేట్ ప్రకారం.. యాలకులను నమలడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా 54 శాతం తొలగిపోతుంది. ఇది శ్వాసలో రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. 
 

క్యాన్సర్ నివారణ

చిన్న యాలకుల్లో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. దీనిని తినడం వల్ల ఎంజైములు చురుగ్గా మారుతాయి. ఇవి క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీన్ని తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది శరీరంలో కణితి కణాలు పెరగకుండా నిరోధిస్తుంది.

ఒక పరిశోధన ప్రకారం.. యాలకులను తినడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి. దీనివల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ను ఎదుర్కోవటానికి 48 శాతం వరకు సహాయపడుతుంది. 
అంతేకాదు ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే యాలకులు నోటి క్యాన్సర్ చికిత్సలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నోటి క్యాన్సర్ కణాల వ్యాప్తిని యాలకులు నిరోధిస్తాయని కనుగొనబడింది.
 

బరువు తగ్గడానికి 

విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే యాలకులను మరిగించి దాని నీటిని తాగడం వల్ల ఊబకాయం సమస్యను దూరం అవుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. కొవ్వును తగ్గించడానికి యాలకులు బాగా సహాయపడతాయి. వీటిలో ఉండే క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియంతో పాటుగా దీనిలో ఉండే పరిమిత కేలరీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!