పుల్ల పుల్లని చింతపండును ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. దీన్ని పప్పుల్లో, చట్నీలతో పాటుగా ఎన్నో కూరల్లో వేస్తుంటారు. నిజానికి చింతపండుతో చేసిన కూరలు డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి. అందుకే ఈ పుల్లని వంటలంటే చాలా మందికి ఇష్టం. నిజానికి చింతపండును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
tamarind
చింతపండు పోషకాలు
చింతపండు ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, కెరోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా, మెరుగ్గా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. చింతపండులో పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటును నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
చింతపండులో ఫ్లేవనాయిడ్లు వంటి పాలీఫెనాల్స్ కూడా మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇక దీనిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చింతపండు ప్రయోజనాలు
చింతపండు మనకు టానిక్ గా పనిచేస్తుంది. చింతపండు అనెరేటివ్, యాంటీసెప్టిక్, యాంటిపైరెటిక్ గా పనిచేస్తుంది. చింతపండును తింటే పేగులతో పాటుగా జీర్ణ అవయవాలను సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.