మెరుగైన జీర్ణక్రియ
బాదం పప్పుల్లో మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్,విటమిన్ కె, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్, రాగి, జింక్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బాదం పప్పులను నీళ్లలో నానబెడితే ఆల్గేలో ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది
బాదం పప్పులను రోజూ తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇది మీ పిల్లల మెదుడు సరిగ్గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలకు రోజూ నానబెట్టిన బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు మెదడు కణాలను రిపేర్ చేస్తాయి. అలాగే ఐక్యూ లెవెల్స్ ను పెంచుతాయి. మెదడును షార్ప్ గా చేస్తుంది.