భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 23, 2024, 11:00 AM IST

పచ్చి ఉల్లిపాయల్ని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. చికెన్, మటన్, బిర్యానీ, నూడుల్స్ ఇలా ఎన్నో రకాల వంటకాల్లో సైడుకు పెట్టుకుని పచ్చి ఉల్లిపాయల్ని తింటుంటారు. కానీ ఇలా పచ్చి ఉల్లిపాయల్ని తింటే ఏమౌతుందో తెలుసా?

మనం రోజూ తినే కూరల్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి. అసలు కొంతమంది అయితే ఉల్లిపాయలు లేకుండా కూరలే చేయరు. నిజానికి ఈ ఉల్లిపాయలు కూరల్ని టేస్టీగా చేయడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉల్లిపాయల్ని ఉడికించి, పచ్చితగా తింటుంటారు. 

చాలా మంది కూరలో వేసినా కూడా పచ్చి ఉల్లిపాయల్ని భోజనంతో పాటుగా తింటుంటారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫ్రై వంటి ఎన్నో రకాల ఆహారాలతో పాటుగా తింటుంటారు. ఎందుకంటే ఈ పచ్చి ఉల్లిపాయలు ఆ ఫుడ్ టేస్ట్ ను పెంచుతాయి. కానీ ఈ పచ్చి ఉల్లిపాయల్ని తింటే ఏమౌతుందో తెలుసా? 



చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

గట్ ఆరోగ్యం

ఉల్లిపాయలు గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయల్లో ఫ్రక్టోలిగోసాకరైడ్లు, ఇనులిన్ వంటి ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గట్ లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 


ఇమ్యూనిటీ 

ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి పచ్చి ఉల్లిపాయలు బాగా ఉపయోగపతాయి. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. ముఖ్యంగా ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. దీంతో మీరు దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద సమస్యలకు దూరంగా ఉంటారు. 

బరువు తగ్గుతారు 

బరువు తగ్గాలనుకునేవారికి కూడా పచ్చి ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు హెవీగా తినకుండా ఉంటారు. అలాగే ఇతర చెడు ఆహారాల జోలికి వెళ్లకుండా ఉంటారు. దీంతో మీరు ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతారు. 
 

ചര്‍മ്മം


చర్మ ఆరోగ్యం

చాలా మందికి చర్మ సమస్యలు తరచుగా వస్తుంటాయి. వీటికి ఎన్ని క్రీములను వాడినా తగ్గనే తగ్గవు. అయితే ఈ చర్మ సమస్యలను తగ్గించడానికి పచ్చి ఉల్లిపాయలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనం ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని సాఫ్ట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

గుండె ఆరోగ్యం

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ గుండె జబ్బులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పచ్చి ఉల్లిపాయలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు. పచ్చి ఉల్లిపాయలలో ఫ్లేవనాయిడ్లు, థియోసల్పినేట్లు అని పిలువబడే సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!