ఈ బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది..!

First Published | Jul 21, 2023, 1:08 PM IST

ఫైబర్ తో పాటు చాలా న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా బరువు తగ్గడానికి ఎక్కువగా సహాయపడుతాయి.

చాలా మంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా చాలా మంది అస్సలు బరువు తగ్గలేరు. దానికి కారణం వారు సరైన మోతాదులో ఫైబర్ తీసుకోకపోవడం కూడా కావచ్చు. దాని కోసం మీరు మీ తసుకునే ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఈ కింది  బ్రేక్ ఫాస్ట్ లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం..
 

1. తృణ ధాన్యాలు..
మీరు తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో తృణ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. వాటితో తయారు చేసిన దేనినై మీరు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే సరిపోతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కేవలం అల్పాహారంలో వీటిని తీసుకోవడం వల్ల, కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.లంచ్ వరకు మళ్లీ ఆకలి అనిపించదు. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


2.ఓట్స్..
ఓట్స్ లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ తో పాటు చాలా న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా బరువు తగ్గడానికి ఎక్కువగా సహాయపడుతాయి.


3.పండ్లు..
పండ్ల రసాలతో పోలిస్తే, పండ్లలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి, పండ్లు తినడం వల్ల, పొట్ట త్వరగా ఫుల్ అయిపోయిన అనుభూతి కలుగుతుంది. అయితే, సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి.
 

Image: Freepik

4.బాదం పప్పు..
బాదం పప్పును రాత్రిపూట నానపెట్టి, పొద్దునే తినాలి. ఇలా చేయడం వల్ల ఫైబర్ మీకు పుష్కలంగా లభిస్తుంది. దీంట్లో చాలా న్యూట్రియంట్స్  మీకు కావాల్సినవన్నీ అందిస్తాయి.

5.మిల్లెట్స్..
సాధారణంగా అందరూ బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, దోశలు తినాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటివారు మిల్లెట్స్ తో తయారు చేసిన ఇడ్లీ, దోశలను ఇష్టంగా తినొచ్చు. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

Image: Freepik


6.చియా సీడ్స్..
చియా సీడ్స్ చూడటానికి  చాలా చిన్నగా ఉంటాయి. కానీ, వీటిలో ఫైబర్ మాత్రం దండిగా ఉంటుంది. వీటిని మీరు రకరకాలుగా తీసుకోవచ్చు.
 


7.నట్స్..
అన్ని నట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు నట్స్ తీసుకోవడం వల్ల మీకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Latest Videos

click me!