ఈ పండు జ్యూస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
ముందు ఈ పండును కట్ చేసి... దానిలోని పల్ప్ ని స్పూన్ సహాయంతో బయటకు తీయాలి. ఆ పల్ప్ లో నుంచి గింజలు మొత్తం బయటకు తీయాలి. గింజలు చేదుగా ఉంటాయి కాబట్టి... వాటిని తీసేసి..మిగిలిన పల్ప్ ని స్మాష్ చేయాలి.
ఈ పల్ప్ లో కొద్దిగా చల్లటి నీరు పోసి.. మరోసారి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా. .. వడబోసుకోవాలి. లేదు.. మాకు ఫైబర్ కావాలి అంటే.. పల్ప్ కూడా తీసుకోవచ్చు. లేదుంటే.. వడబోసుకుంటే సరిపోతుంది. రుచికోసం కావాలంటే పంచదార లేదంటే.. తేనె కలుపుకోవచ్చు. ఇదే జ్యూస్ లో చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకున్నా... రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం...