ఈ విషయం తెలిస్తే రోజూ మధ్యాహ్నం పూట బెండకాయను తినకుండా ఉండనేలేరు

First Published Dec 4, 2023, 12:40 PM IST

బెండకాయకాయ కూర కాస్త జిగురుగా ఉన్నా ఇది మన ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది. అవును ప్రతి రోజూ మధ్యాహ్నం పూట బెండకాయ కూరను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. 
 

okra

బెండకాయ కూరను చాలా తక్కువ మందే తింటారు. ఎందుకంటే ఈ కూర కొంచెం జిగురుగా ఉంటుంది. కానీ బెండకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మీకు తెలుసా? బెండకాయలో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. బెండకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

పీచుపదార్థం ఎక్కువగా ఉండే బెండకాయను తినడం వల్ల డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బెండకాయ కూరను తినడం వల్ల మీరోజువారి ఆహారాల నుంచి కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. దీంతో మీ గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బెండకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు బెండకాయలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. 

Latest Videos


okra

బెండకాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ మన జీర్ణక్రియకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బెండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం పొందుతారు. బెండకాయలో విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. అందుకే దీన్ని రెగ్యులర్ గా తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 

Okra

అంతేకాదు బెండకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. బెండకాయ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండే బెండకాయ మన ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బెండకాయను తింటే ఎముకలు బలంగా ఉంటాయి. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే బెండకాయను తీసుకోవడం వల్ల కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెండకాయ కూరను తినడం వల్ల కొన్ని రకాల  క్యాన్సర్ల ముప్పు తప్పుతుంది. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా బెండకాయను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. బెండకాయలో ఉండే ఫైబర్ మీ ఆకలిని తగ్గిస్తుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

click me!