రోజుకు ఒక్క జామకాయను తిన్నా ఇన్ని లాభాలుంటాయా?

First Published | May 27, 2023, 1:42 PM IST

జామకాయలకు కొదవే ఉండదు. ఇవి టేస్టీగా ఉండటంతో చాలా మందిని వీటిని ఎక్కువగా తింటుంటారు. నిజానికి జామకాయల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి తెలుసా? 


జామకాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  అందులోనూ ఈ పండు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. మీకు తెలుసా? జామ పండులో నారింజ పండ్ల కంటే రెట్టింపు విటమిన్ సి ఉంటుంది. జామకాయ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుందని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. 

జర్నల్ ఆఫ్ బయోలాజికల్ రెగ్యులేటర్స్ అండ్ హోమియోస్టాటిక్ ఏజెంట్స్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం..  జామకాయలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 


జామకాయలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలను తటస్తం చేయడానికి, తగ్గించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక జంతు అధ్యయనంలో.. జామకాయ సారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదని కనుగొనబడింది.

Guava

జామకాయలో ఎక్కువ మొత్తంలో ఉండే సోడియం, పొటాషియం రక్తపోటును నిర్వహించడానికి సహాయపడతాయి. అంతేకాక హైపర్ టెన్షన్ తో బాధపడేవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జామపండులో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. జామపండులోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. నిజానికి అరటిపండు, జామపండులో దాదాపు ఒకే మొత్తంలో పొటాషియం కంటెంట్ ఉంటుంది.
 

జామకాయ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది. జామపండులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9 పుట్టబోయే బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పుతుంది. అలాగే ఎలాంటి న్యూరోలాజికల్ డిజార్డర్స్ రాకుండా కాపాడుతుంది.


జామకాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇక జామకాయలో  ఉండే  ఫైబర్ కంటెంట్ చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జామకాయను తింటే మనన శరీరంలో సోడియం, పొటాషియంలు సమతుల్యంగా ఉంటాయి. ఇది డయాబెటీస్ పేషెంట్లకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

Latest Videos

click me!