రోజూ గుప్పెడు అవిసె గింజలను తింటే ఈ రోగాలకు దూరంగా ఉండొచ్చు..!

First Published | Oct 7, 2023, 2:48 PM IST

అవిసె గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ గుప్పెడు గింజలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.    
 

​flaxseeds

అవిసె గింజలు చూడటానికి చిన్నగా ఉన్నా ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ గింజల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు ఎన్నో రోగాల ముప్పును తప్పిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలను రోజూ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

flaxseeds

మలబద్దకం 

మలబద్దకం సమస్యకు ఎన్నో కారణాలు ఉంటాయి. నీళ్లను పుష్కలంగా తాగకపోవడం, ఫైబర్ ను ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. అయితే అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది. 
 


అధిక రక్తపోటు

అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, గుండెజబ్బులకు దారితీస్తుంది. అయితే అవిసె గింజలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అవిసె గింజల నూనె దీనికి కూడా ఎంతో సహాయపడుతుంది.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

అవిసె గింజల్లో కూడా చేపల మాదిరిగానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు తినని వాళ్లు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పొందడానికి అవిసె గింజలు తినొచ్చు. లేదా అవిసె గింజల నూనెను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. 
 

కొలెస్ట్రాల్

అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి అవిసె గింజలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

Image: Getty Images

బ్లడ్ షుగర్

డయాబెటీస్ లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గుణం కూడా ఉంటుంది. అందుకే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు అవిసె గింజను కూడా తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
 

ప్రోటీన్

శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా అవిసెగింజల్లో పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే మన  శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. 
 

flax seeds

బెల్లీ ఫ్యాట్

అవిసె గింజలు కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే శరీర బరువును కూడా నియంత్రించడానికి సహాయపడతాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే అవిసె గింజలు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. ఇవి ఆకలిని కూడా నియంత్రిస్తాయి.
 

పొడవైన జుట్టు

విటమిన్ ఇ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే అవిసె గింజలను తీసుకోవడం కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇవి జుట్టును బలంగా ఉంచుతాయి. 

Latest Videos

click me!