చలికాలంలో పెరుగు తినొచ్చా?

First Published | Dec 19, 2023, 1:10 PM IST

పెరుగులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే రోజూ కప్పు పెరుగును ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది జలుబు చేస్తుందని చలికాలంలో పెరుగును తినడానికి ఇష్టపడరు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే? 
 

పెరుగు

పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. పెరుగులో కాల్షియం, విటమిన్ బి -2, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ కూడా. పెరుగును తింటే శరీరంలో వేడి చేసే అవకాశం ఉండదు. కడుపు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదు ఇది మనం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. 
 

పెరుగు

పెరుగులో చలువ చేసే గుణాలుంటాయన్న ముచ్చట అందరికీ తెలుసు. అందుకే పెరుగును ఎండాకాలంలో ఎక్కువగా తింటారు. మజ్జిగను తాగుతుంటారు. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కానీ చలికాలంలో చాలా మంది పెరుగుకు దూరంగా ఉంటారు. ఎందుకంటే దీనివల్ల జలుబు చేస్తుందని. అలాగే శరీర వేడి తగ్గి ఎక్కువ చలి పెడుతుందని. 
 

Latest Videos


Image: Freepik

కానీ చలికాలంలో పెరుగును తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే చలికాలంలో కూడా పెరుగును తినొచ్చని పోషకాహార నిపుణులు కిరణ్ కుక్రేజా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలియజేశారు. రోజూ పెరుగును తినడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కడుపునొప్పి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఎసిడిటీ వచ్చే అవకాశమే ఉండదు. 
 

పెరుగు

ప్రోబయోటిక్ కావడంతో పెరుగులో మంచి బ్యాక్టీరియా మెండుగా ఉంటుంది. ఇవి మన గట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోజూ పెరుగును తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే జలుబు, తుమ్ములు వంటి అలెర్జీ వ్యాధుల నుంచి కూడా మిమ్మల్ని పెరుగు కాపాడుతుంది.

పెరుగు

పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే మన ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ ఖనిజాలు అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. రోజూ పెరుగును తినడం డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. ఎందుకంటే పెరుగు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. పెరుగును తినడం వల్ల కేలరీల వినియోగం తగ్గుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది. పెరుగు మన చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

click me!