చలికాలం వచ్చేసింది. ఈ చలికాలం చల్లని గాలులకు ఇంట్లో కూడా వణుకుపెరుగుతోంది. ఈ చల్లని వాతావరణంలో ఎక్కువ మంది హాట్ ఫుడ్స్, క్రంచీ గా ఉండే ఆహారాలు తినాలని అనుకుంటూ ఉంటారు. కానీ, వాటికి బదులు మీ ఆహారంలో క్యారెట్ ని భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్లు పోషకాలకు పవర్ హౌస్.ఇందులో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. మీరు దీన్ని సలాడ్‌లు, సూప్‌లు, కూరలలో ఉపయోగించవచ్చు, అయితే క్యారెట్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..