కొబ్బరిని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే.. తినకుండా అస్సలు ఉండలేరు

First Published | Dec 16, 2023, 12:28 PM IST

కొబ్బరి, కొబ్బరి నీరు, కొబ్బరి పాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొబ్బరిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందంటే? 
 

కొబ్బరికాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మనం కొబ్బరి కాయ వాటర్ ను తాగుతాం. కొబ్బరి పాలను ఉపయోగించుకుంటాం. అలాగే కొబ్బరిని తినడం తో పాటుగా వంటల్లో కూడా ఉపయోగిస్తుంటాం. కొబ్బరి కాయలో ఎన్నో రకాల పోషకాలు దాగున్నాయి. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి మంచి పోషకాల నిధి కూడా. అసలు కొబ్బరిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పోషకాలు సమృద్ధిగా..

కొబ్బరి పోషకాలకు మంచి వనరు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఇనుము, పొటాషియంతో పాటుగా మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తింటే మన శరీరానికి లోపలి నుంచి పోషణ అందుతుంది. ఈ పోషకాలు మన రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. 
 


రక్తంలో చక్కెర నియంత్రణ

కొబ్బరి మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచడంతో పాటుగా ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

మంటను తగ్గించడం

దీర్ఘకాలిక మంట గుండె సంబంధిత రోగాల నుంచి ఆర్థరైటిస్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కొబ్బరిలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. అలాగే లారిక్ ఆమ్లం శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది. అంటే కొబ్బరిని తింటే మంట తగ్గుతుంది. అలాగే  మంట వల్ల కలిగే సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. 
 

Coconut

అభిజ్ఞా పనితీరు మెరుగు

కొబ్బరి అభిజ్ఞా పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలోని ఎంసీటీలు  అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఇది మన బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

coconut

యాంటీ బాక్టీరియల్ 

కొబ్బరిలో మీడియం-చైన్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరానికి హానిచేసే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. కొబ్బరి నూనె పుల్లింగ్ నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. అలాగే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. 

Latest Videos

click me!