జంక్ ఫుడ్ ఎందుకు దండగ.. ఈ హెల్దీ ఫుడ్ ఉండగ..!

First Published | Dec 15, 2023, 12:29 PM IST

ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అని కంప్లీట్ గా ఈ ఫుడ్ మానేయాలంటే చాలా మందికి కష్టంగా ఉంటుంది. కానీ, ఈ జంక్ ఫుడ్స్ కి కొన్ని ఆల్టర్నేటివ్ గా కొన్ని హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
 

ఈరోజుల్లో చాలా మంది పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా జంక్ ఫుడ్స్ కి అలవాటుపడిపతున్నారు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా, బోర్ కొట్టినా, మూవీ చూసినా ఎలా ఛాన్స్ దొరికితే చాలు  అందరూ పాప్ కార్న్, పిజ్జా, బర్గర్ అంటూ జంక్ ఫుడ్స్ తినేస్తున్నారు. అయితే.. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అని కంప్లీట్ గా ఈ ఫుడ్ మానేయాలంటే చాలా మందికి కష్టంగా ఉంటుంది. కానీ, ఈ జంక్ ఫుడ్స్ కి కొన్ని ఆల్టర్నేటివ్ గా కొన్ని హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
 

1.ముందుగా మనం బయటకు వెళ్లాం అంటే చాలు కాలం తో సంబంధం లేకుండా కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటాం. కూల్ డ్రింక్స్ వల్ల అధిక బరువు పెరిగిపోవడం, ఇతర అనారోగ్య సమస్యలు చాలానే వస్తుంటాయి. కాబట్టి, వాటిని ఆపేసి, వాటిస్థానంలో తాజా పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకోవాలి. తాజా పండ్ల రసాల వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎనర్జీని త్వరగా అందిస్తాయి.


popcorn

2.ఇక మరో ముఖ్యమైనది పాప్ కార్ట్. సినిమా అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఈ పాప్ కార్న్. కానీ.. ఈ పాప్ కార్న్ కూడా జంక్ ఫుడ్ కిందకే వస్తుంది. ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. ముఖ్యంగా ఎక్కువగా బటర్, సాల్ట్ వేసినవి అస్సలు మంచిది కాదు. దానికి బదులుగా మీరు ప్లెయిన్ పాప్ కార్న్ తీసుకుంటే సరిపోతుంది. ప్లెయిన్ పాప్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

3.చాలా మందికి ఖాళీ సమయాల్లో చాక్లెట్స్ తినాలిపిస్తూ ఉంటుంది. అయితే మీరు చాక్లెట్ కి బదులుగా, డార్క్ చాక్లెట్ తినడం అలవాటు చేసుకోండి. డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది. ఇతర చాక్లెట్స్ లాగా దీనిలో ఎక్కువగా ప్రాసెసింగ్ ఉండదు. చెక్కర కూడా తక్కువగా ఉంటుంది.

4.ఇక కొందరు కూల్ డ్రింక్స్, సోడాలు ఉన్నవి తాగుతూ ఉంటారు. వీటికి బదులు మీరు ఇంట్లో తయారు చేసిన లెమన్ వాటర్ తాగడం మంచిది. ఈ లెమన్ వాటర్ లో షుగర్ ని మనం మనకు నచ్చినంత కంట్రోల్ గా వేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా కూడా స్కిప్ చేయవచ్చు.
 


5.పిల్లలు ఎక్కువగా ఇష్టపడే మరో స్నాక్ ఫ్రెంచ్ ప్రైస్. వీటిలోనే అనవసరపు కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అందుకే  ఫ్రెంచ్ ప్రైస్ కి బదులుగా మీరు కూరగాయలను ఉపయోగించవచ్చు. క్యారెట్, బ్రొకలీ వంటి వాటిని ఎయిర్ ఫ్రయ్యర్ ఉపయోగించి, ఫ్రై చేసుకొని తినవచ్చు.

Latest Videos

click me!