మన దేశంలో ఎక్కువ మంది కామన్ గా తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది రైస్. బరువు తగ్గడానికి చాలా మంది ఈ మధ్య రైస్ తినడం మానేస్తున్నారు. కానీ... చాలా మందికి రోజులో ఒక్క పూట అయినా.. అన్నం తినకపోతే.. భోజనం చేసిన అనుభూతి కలగదు. రెగ్యులర్ గా నార్మల్ రైస్ తిన్నా... అప్పుడప్పుడు మనం బాస్మతీ రైస్ తింటూ ఉంటాం.
బిర్యానీ అంటే కచ్చితంగా అది బాస్మతీ రైస్ తో చేయాల్సిందే. అప్పుడే ఈ బిర్యానీ రుచిని అందిస్తుంది. అందరూ.. బిర్యానీలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటూ ఉంటారు. కానీ... అదే బిర్యానీ తయారు చేసే బాస్మతీ రైస్ తినడం వల్ల మనకు ఊహించని ప్రయోజనాలు అందుతాయట. బాస్మతీ రైస్ రెగ్యులర్ గా తినడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం...
బాస్మతీ రైస్ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే.. బాస్మతీ రైస్ లో థయమైన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇందులో విటమిన్ బి1, డైటరీ ఫైబరీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
అంతేకాదు... చాలా మంది బాస్మతీ రైస్ తింటే బరువు పెరిగిపోతాం అనుకుంటారు. కానీ.. బాస్మతీ రైస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే... బాస్మతీ రైస్ తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో... ఇతర జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక కలగదు. దీంతో.. ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. బాస్మతీ రైస్ లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.
ఇతర రైస్ లతో పోలిస్తే... బాస్మతీ రైస్ లో న్యూట్రీషనల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.బాస్మతీ రైస్ లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా.. ఈ బాస్మతీ రైస్ ని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.
basmati rice
గుండె ఆరోగ్యానికి కూడా బాస్మతీ రైస్ చాలా మేలు చేస్తుంది. దీనిలో హై ఫైబర్ ఉండటం వల్ల... గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా.. బాస్మతీ రైస్ తినొచ్చు. గుండె కు చాలా మంచిది. అంతేకాదు. ఈ రైస్ తింటే.. సులభంగా అరగదేమో అనే భయం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా, సులభంగా జీర్ణమౌతుంది.
మామూలు బియ్యంతో పోలిస్తే.. ఈ రకం అన్నంలో మినరల్స్ కాస్త ఎక్కువగా ఉంటూనే ఉంటాయి. జింక్, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, కాపర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. బాస్మతీ రైస్ మంచిది కాదని, తినకూడదు అని ఎవరైనా చెబితే నమ్మకండి. హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.