పరిగడుపున నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Mar 24, 2024, 9:49 AM IST

మనం ప్రతిరోజూ పరిగడుపున చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిలో నీళ్లు తాగడం ఒకటి. అవును ఉదయాన్నే పరిగడుపున నీళ్లను తాగితే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
 

చాలా మంది ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసే ముఖం కడిగి అప్పుడు టీ తాగుతుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. పరిగడుపున టీ తాగితే గ్యాస్, ఎసిడిటీ వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ నిద్రలేచిన వెంటనే మనం చేయాల్సిన మొదటి పని నీళ్లను తాగడం. అవును ఉదయాన్నే పరిగడుపున గ్లాస్ నీళ్లను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 
 

గ్లోయింగ్ స్కిన్

ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీటిని తాగితే మన చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. నీళ్లతో శరీరం హైడ్రేట్ గా మారుతుంది. దీంతో చర్మంలో ముడతలు తగ్గి నేచురల్ గ్లో పెరుగుతుంది. అలాగే చర్మ  సమస్యలు కూడా రావు. ఒకవేళ ఉన్నా అవి తగ్గిపోతాయి. 
 

షుగర్ లెవెల్స్ కంట్రోల్ 

ఉదయాన్నే పరిగడుపున గ్లాస్ నీళ్లను తాగడం డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్లు ఉదయాన్నే గ్లాస్ నీళ్లను తాగితే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు. 

జీర్ణం

పరిగడుపున నీళ్లను తాగితే మీ జీర్ణక్రియ కూడా పెరుగుతుంది. ఉదయాన్నే పరిగడుపున నీళ్లను తాగితే బ్రేక్ ఫాస్ట్ బాగా జీర్ణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనివల్ల మలబద్దకం సమస్య ఉంటే కూడా తగ్గిపోతుంది. 

బలమైన జుట్టు 

నీరు జుట్టుకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మన శరీరంలో డీహైడ్రేషన్ వల్ల చర్మమే కాదు జుట్టు కూడా పొడిబారుతుంది. పెళుసులుగా కనిపిస్తుంది. మీరు ఉదయాన్నే నీళ్లను తాగితే మీ జుట్టు  తాగడం వల్ల జుట్టు అందంగా మెరుస్తుంది. అలాగే బలంగా పెరుగుతుంది కూడా.
 

మూత్రపిండాల్లో రాళ్లు 

ఉదయాన్నే పరిగడుపున నీళ్లను తాగితే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. నీళ్లు మూత్రపిండాల్లోని ఆమ్లాన్ని పలుచగా చేయడానికి చాలా అవసరం. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఉదయాన్నే గ్లాస్ నీళ్లను తాగండి. 

శక్తి పెరగడం

ఉదయాన్నే పరగడుపున నీళ్లను తాగితే మన శరీరంలో  ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి మనల్ని రోజంతా  శక్తివంతంగా ఉంచుతాయి. అలసటను దూరం చేస్తాయి.
 

click me!