వెల్లుల్లి ఇలా తింటే.. ఈజీగా బరువు తగ్గిస్తాయి..!

First Published | Mar 23, 2024, 1:15 PM IST

బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవల్స్ ని తగ్గించడంలోనూ సహాయం చేస్తాయి. ఈ వెల్లుల్లిని మనం పచ్చిగా లేదా.. ఏదైనా ఫుడ్ లో భాగం చేసుకొని తీసుకున్నా కూడా సులభంగా బరువు తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

garlic

మనం వంటలో విరివిగా ఉపయోగించే చాలా వస్తువుల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లిని మసాలాగా మనం వాడుతూ ఉంటాం. కానీ.. ఈ చిన్న వెల్లుల్లి మనం ఈజీగా బరువు తగ్గించడంలో కీలకంగా పని చేస్తాయి. వెల్లుల్లి మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు.. బాడీని డీటాక్సిఫై చేయడానికి సహాయం చేస్తుంది. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవల్స్ ని తగ్గించడంలోనూ సహాయం చేస్తాయి. ఈ వెల్లుల్లిని మనం పచ్చిగా లేదా.. ఏదైనా ఫుడ్ లో భాగం చేసుకొని తీసుకున్నా కూడా సులభంగా బరువు తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

garlic

అందుకే.. వెల్లుల్లి మెయిన్ పార్ట్ చేస్తూ.. తయారు చేసే ఈ కింది వంటలను కనక రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గింవచ్చు. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..


1.గార్లిక్ కుకుంబర్ రైతా..
మనం ఈ ఎండల్లో కడుపులో చల్లగా ఉండేందుకు పెరుగుతో రైతా చేసుకుంటూనే ఉంటాం. అదే రైతాలో చాలా మంది కీరదోస ముక్కలు కూడా వేసుకుంటారు. అందులో వెల్లుల్లి కూడా జత చేయాలి. అప్పుడు ఈరైతాలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. గట్ హెల్త్  ఇంప్రూవ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. సులభంగా బరువు తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

2.గార్లిక్ పరాతా..
మనం మామూలుగా చాలా రకాల పరాటాలను తినడానికి ఇష్టపడతాం. ఆలూ పరాటా, పన్నీర్ పరాటా అలా చాలా తింటాం. ఈసారి గార్లిక్ పరాటా ప్రయత్నించండి. రుచి అద్భుతంగా ఉంటుంది.  మనం బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

Poha

3.గార్లిక్ పోహ..
అటుకుల ఉప్మాని మనం పోహ అని పిలుస్తాం. దీనిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పోహలో మీరు వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కోసుకొని వాడాలి. ఇలా వెల్లుల్లి కలిపి తినడం వల్ల.. దానికి రుచి పెరగడంతోపాటు.. ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

peanut

4.గార్లిక్ పీనట్స్..

సాధారణంగా పీనట్స్ ని మనం స్నాక్స్ లా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ పీనట్స్ నే.. గార్లిక్ పౌడర్ వాడి తినడం వల్ల.. వాటికి మరింత రుచి పెరుగుతుంది. అదేవిధంగా బరువు తగ్గడంలోనూ సహాయం చేస్తుంది
 

Puffed Rice

5.గార్లిక్ మరమరాలు..
మరమరాల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తింటే మామూలుగానే ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా బరువు తగ్గడంలోనూ కీలంగా పని చేస్తాయి. అలాంటి వాటికి వెల్లుల్లిని జత చేస్తే.. రుచి అదిరిపోతుంది. బరువు కూడా తగ్గవచ్చు.

Latest Videos

click me!