కొలెస్ట్రాల్ ను తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవి.. !

First Published Mar 23, 2024, 1:27 PM IST

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అందుకే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆహారాలు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అవేంటంటే? 

high cholesterol

ఫుడ్ ను ఇష్టపడనివారుండరు. రకరకాల ఆహారాలను వండుకుని లేదా కొని తింటుంటారు. కానీ బయటిఫుడ్ ను ఎక్కువగా తింటే లేనిపోని రోగాలు వస్తాయి. మనలో చాలా మంది ఆయిలీ, స్పైసీ ఫుడ్ నే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. దీనికితోడు ఈ రోజుల్లో స్ట్రీట్ ఫుడ్ ట్రెండ్ కూడా బాగా పెరిగింది. కానీ వీటన్నింటినీ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అలాగే  రోజూ వ్యాయామం, జాగింగ్, వాకింగ్, రన్నింగ్, యోగా మొదలైనవి చేయని వారి శరీరంలో కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. 

High Cholesterol

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆహారాలను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరగడం స్టార్ట్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం కూడా ఉండదు. ఇలాంటి కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మొలకెత్తిన పప్పులు

పచ్చి పెసర్లు, శెనగలు,  రాజ్మా, సోయాబీన్ల మొలకెత్తిన సలాడ్ లేదా చాట్ ను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇవి తింటే మీ జీర్ణశక్తి సమతుల్యంగా ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవి మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 
 

soaked almonds

బాదం

బాదం పప్పులను తింటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. మీరు రోజూ రాత్రి 4 నుంచి 6 బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్నే తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. బాదం పప్పుల్లో ప్రోటీన్లు, ఫైబర్,ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెండగా ఉంటాయి. ఇవన్నీ పోషక లోపాలను పోగొడుతాయి.
 

Peanut


వేరుశెనగ

వేరుశెనగలు తింటే కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పల్లీల్లో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీరు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు అందడంతో పాటుగా  శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇందుకోసం మీరు రోజూ 50 గ్రాముల పల్లీలను తినండి. 
 

Image: Getty Images

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ కూడా శరీరంలోని ఎక్స్ ట్రా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు రోజూ మూడు కప్పుల ఆరెంజ్ జ్యూస్ ను తాగండి. ఆరెంజ్ జ్యూస్ ను తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. 

ఆకు కూరలు

ఆకుకూరల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ లతో పాటుగా ఇనుము,  కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంతో పాటుగా మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 

click me!