
Sabja Seeds Water in Summer: బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలను తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఈ వేడి తట్టుకోవాలి అంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏది పడితే అది తింటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.ముఖ్యంగా శరీరంలో వేడి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో లభించే కొన్ని సహజ పదార్థాలతో తయారు చేసిన డ్రింక్ తాగాలట. వాటిల్లో సబ్జా గింజలు ముందు వరసలో ఉంటాయి. ఈ ఎండాకాలం రోజంతా శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మరి, ఈ సబ్జా గింజల నీటిని ఎలా తీసుకోవాలి? దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో చూద్దామా...
ముఖ్యంగా వేసవి కాలంలో నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరానికి కలిగే వడదెబ్బ (Sunstroke) సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఈ గింజలలో ఫొలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక ఇన్ని పోషకాలను కలిగిన సబ్జా గింజలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.
ఎండాకాలంలో సబ్జా గింజలతో ప్రయోజనాలు...
వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పడుతుంది. దాని వల్ల మన శరీరంలోని నీరంతా బయటకు పోతుంది.బాడీ డీహైడ్రేటెడ్ అయిపోతుంది. అందుకే ఈ సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. చాలా మంది వేడి తట్టుకోలేక కూల్ డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉంటారు. కానీ, వాటి వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే వాటికి బదులు నీటిలో నానపెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే సరిపోతుంది.
సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.మీరు చెమట ద్వారా కొల్పోయే ఎలక్ట్రోలైట్లు, నీరు భర్తీ చేయడంలో సహాయపడుతుంది. అందుకే.. దాహం వేసిన ప్రతిసారీ ఈ నీటిని తాగితే సరిపోతుంది. సబ్జా గింజల్లో విటమిన్ ఎ, ఇ, కె వంటి విటమిన్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్ , ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైన నీరు, పోషకాలను అందిస్తాయి. ఈ సబ్జా నీటిని తాగడం వల్లా ఎసిడిటీ సమస్యను తగ్గించడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది.
ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును (Fat) కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు డైట్ లో సబ్జా గింజలను చేర్చుకోవడం మంచిది. వాతావరణంలో మార్పుల కారణంగా కలిగే శ్వాసకోశ సమస్యల (Respiratory problems) నివారణ కోసం సబ్జా గింజల పానీయంలో కొద్దిగా అల్లం రసం, తేనే కలిపి తీసుకోవాలి.
సబ్జా గింజలను ఎలా తినాలి?
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టీస్పూన్ల సబ్జా గింజలను సుమారు 15 నిమిషాలు నానబెట్టండి. అవి ఉబ్బి పరిమాణం పెరిగేకొద్దీ, ప్రతి నల్ల గింజ చుట్టూ జెల్లీలాగా మారుతుంది.ఇప్పుడు మీరు ఈ విత్తనాలను నిమ్మరసం, మిల్క్‌షేక్‌లు, కొబ్బరి నీరు, స్మూతీలు, మజ్జిగ, సూప్‌లు వంటి వివిధ పానీయాలకు జోడించవచ్చు.