ఈ పండ్లు ఉదయాన్నే తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 18, 2023, 2:40 PM IST

ఎక్కువగా ఉండే పండ్లు తీసుకుంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుకోగలుగుతాం. ఇంత మేలు చేసే పండ్లు అయినా సరే.. ఈ కింది పండ్లను మాత్రం ఉదయాన్నే పరగడుపున అస్సలు తీసుకోకూడదట. 

fruits

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఎంత ఎక్కువగా పండ్లు తీసుకుంటే అంత మంచిది. నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకుంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుకోగలుగుతాం. ఇంత మేలు చేసే పండ్లు అయినా సరే.. ఈ కింది పండ్లను మాత్రం ఉదయాన్నే పరగడుపున అస్సలు తీసుకోకూడదట. ఆ పండ్లు ఏంటో ఓసారి చూద్దాం..

fruits

1.మామిడి...
సమ్మర్ లో మామిడి పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. మళ్లీ సమ్మర్ అయితే మామిడి పండ్లు కనపడవని అందరూ వీటిని తినడానికి ఇష్టపడతారు. ఉదయం పూట అల్పాహారంలోనూ వీటిని తీసుకుంటారు. మామిడి పండ్లకు రారాజు కూడా. మళ్లీ సమ్మర్ దాకా రావు కదా అని వీటిని తెగ లాగించేస్తున్నారా..? అయితే వీటిని ఉదయాన్నే ఎలాంటి ఆహారం తీసుకోకుండా వీటిని అల్పాహారంలో తీసుకోకూడదు. మామిడి పండ్లలో ఇతర పండ్లకంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తినకూడదు.


fruits


2.కొబ్బరి..
పరగడుపున కొబ్బరి నీరు తాగడం చాలా మంచిది.  కానీ కొబ్బరి తినడం మాత్రం మంచిది కాదు. దీనిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కాదు.

fruits

3.అరటిపండు..
అరటి పండుని కూడా ఉదయనాన్నే బ్రేక్ ఫాస్ట్ లో తినకూడదు . దీనిలో కార్బో హైడ్రేట్స్  ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణమౌతాయి. అందుకే వీటిని తినకూడదు.

fruits

4.పుచ్చకాయ..
పుచ్చకాయను కూడా  ఉదయాన్నే పరగడుపున అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది. తిన్న వెంటనే మళ్లీ ఆకలివేసే అవకాశం ఉంది.

fruits

5.ఆరెంజ్..
ఆరెంజ్ పండ్లను  కూడా పరగడుపున అస్సలు తినకూడదట. వీటిలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పళ్లు పాడవ్వడమేప కాకుండా, ఎసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

grapes for health

6.ద్రాక్ష..
ద్రాక్ష పండ్లను సైతం పరగడుపున తీసుకోకూడదు. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు.

Latest Videos

click me!