రాత్రుళ్లు ఈ పండ్లు తింటే విషంతో సమానం.. ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

Published : Feb 08, 2025, 09:45 AM IST

పండ్లు ఆరోగ్యానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పండ్లను తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను రాత్రుళ్లు అస్సలు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏంటి.? రాత్రుళ్లు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
19
రాత్రుళ్లు ఈ పండ్లు తింటే విషంతో సమానం.. ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఆహారం ఎంతో ముఖ్యం

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యానికి మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి వ్యాధులనైనా ఎదుర్కోవచ్చు. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పండ్లను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతుంటారు. 

29
పండ్లు తినడానికి సరైన సమయం

వైద్యులు కచ్చితంగా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా ప్రతీ సీజన్ లో లభించే పండ్లను కచ్చితంగా తీసుకోవాలని చెబుతుంటారు. అయితే పండ్లను తినడం ఎంత ముఖ్యమో సరైన సమయంలో తినడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. 

39
ప్రమాదం

పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందనడంలో ఎంత నిజం ఉందో. ఒకవేళ సరైన సమయానికి తీసుకోకపోతే అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. అందుకే పండ్లను తీసుకునే విషయంలో కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. 

49
అరటిపండు - రాత్రి తినకూడదు

అరటిపండు

సాధారణంగా చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత అరటి పండ్లను తీసుకుంటారు. కానీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు.  అరటిపండులో పొటాషియం, మైక్రోన్యూట్రియెంట్స్ ఉంటాయి. రాత్రిళ్లు తినకూడదు. ఈ పండు మెలటోనిన్ హార్మోన్‌ను పెంచుతుంది. రాత్రి తింటే నిద్రకు భంగం కలుగుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

59
పుచ్చకాయకు దూరంగా

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా మారుస్తుంది. రాత్రుళ్లు పుచ్చకాయ తింటే జలుబు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే రాత్రుళ్లు తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడంతో నిద్రకు భంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

69
ద్రాక్ష మంచిది కాదు

ద్రాక్షలో చక్కెర ఎక్కువ. ఈ పండు తింటే ఆకలి ఉండదు. కడుపు త్వరగా నిండిపోతుంది. రాత్రి ద్రాక్ష తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అజీర్తి సమస్యలు వస్తాయి. 

79
నారింజ కూడా..

నారింజలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. రాత్రి ఈ పండు తింటే ఎసిడిటీ వస్తుంది. కడుపులో నొప్పి, ఇతర సమస్యలు వస్తాయి.

89
దోసకాయ

నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిలో దోసకాయ కూడా ఒకటి. దోసకాయను రాత్రి పడుకునే ముందు తీసుకుంటే తరచుగా మూత్రవిసర్జన చేసే అవకాశం ఉంటుంది. ఇది రాత్రి నిద్రకు భంగం కలిగిస్తుంది. మెదడుపై ప్రభావం చూపుతుంది. 

99
మామిడికి దూరంగా

రాత్రుళ్లు మామిడి పండు కూడా తినకూడదు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు త్వరగా ఉబ్బిన భావన కలుగుతుంది. దీంతో అజీర్తి, నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

click me!

Recommended Stories