ఈ ఫ్రూట్ జ్యూస్ లు తాగితే పొట్ట కరగడం పక్కా..

First Published | Aug 20, 2024, 4:38 PM IST

ఫ్రూట్స్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు కొన్ని రకాల పండ్ల రసాలను తాగినా మీ బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. అవేంటంటే? 
 

watermelon juice

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండు ఎక్కువగా ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతుంది. ఈ పండులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. పుచ్చకాయ జ్యూస్ ను తాగితే మీరు హైడ్రేట్ గా ఉండటమే కాకుండా.. మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా కూడా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 

pineapple juice

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ జ్యూస్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో బ్రోమెలైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. 



దానిమ్మ రసం

దానిమ్మ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ ఒక దానిమ్మ పండును తింటే ఒంట్లో రక్తం పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.  దానిమ్మ రసాన్ని తాగితే ఆకలి బాధలు తగ్గిపోతాయి. అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. 
 


నిమ్మరసం

బరువును తగ్గించడంలో, బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో నిమ్మరసం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు నిమ్మరసాన్ని రోజూ తాగితే ఇది డిటాక్సిఫైయర్ గా పనిచేసి కడుపులో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగిస్తుంది. అలాగే కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది.


ద్రాక్షపండు రసం

ద్రాక్షరసంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ద్రాక్షరసంలో మన శరీరంలో కొవ్వును కరిగించే లక్షణాలు మెండుగా ఉంటాయి. మీరు ఈ జ్యూస్ ను తాగినా ఈజీగా బరువు తగ్గుతారు. 

Latest Videos

click me!