కేరళ స్పెషల్.. మామిడికాయ చికెన్ కర్రీ, టేస్ట్ అదుర్స్..!

First Published | Jun 4, 2021, 1:43 PM IST

ఇప్పటి వరకు మనం గోంగూర చికెన్, పుదీనా చికెన్ లాంటివి చాలాసార్లు రుచి చూసి ఉంటాం. అయితే.. ఇది మాత్రం అంతకమించిన రుచిని అందిస్తుందట.

మీరు నాన్ వెజ్ ప్రియులా..? అయితే... కచ్చితంగా చికెన్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. ఇక చికెన్ ప్రియులు.. ఎప్పుడూ ఒకే రుచిని ఆస్వాదించాలని అనుకోరు. రకరకాల చికెన్ వంటకాలను రుచి చూడాలను ఉవ్విల్లూరుతుంటారు. మీరు కూడా అలాంటివారైతే.. ఈ మ్యాంగో చికెన్ కర్రీని కచ్చితంగా రుచి చూడాల్సిందే.
మంచి మామిడికాయ తో చేసే ఈ చికెన్ కర్రీ.. కేరళలో చాలా ఫేమస్. మామిడికాయలోని పులుపు.. చికెన్ కర్రీ గ్రేవీలో కలిసిపోయి.. నోట్లో పెట్టుకోగానే కమ్మగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం గోంగూర చికెన్, పుదీనా చికెన్ లాంటివి చాలాసార్లు రుచి చూసి ఉంటాం. అయితే.. ఇది మాత్రం అంతకమించిన రుచిని అందిస్తుందట. మరి దీనిని ఎలా తయారుచేయాలో.. కావాల్సిన పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..నూనె, ఉల్లిపాయ ఒకటి, క్యాప్సికం సగం, అల్లంవెల్లుల్లి పేస్ట్- రెండు టేబుల్ స్పూన్లు, కారం- రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్రపొడి- అర టీస్పూన్, మామిడికాయలు రెండు( తొక్కు తీసి చిన్న ముక్కులుగా కోసుకోవాలి), వెనిగర్- రెండు స్పూన్లు, కొబ్బరిపాలు, పావు లీటర్, బోన్ లెస్ చికెన్- పావు కప్పు, ఉల్లికాడలు
తయారీ విధానం.. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి.. నూనె వేయాలి. ఆ నూనె కాగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు వేయించాలి. వేగిన తర్వాత కారం, జీలకర్రపొడి వేయాలి,
అనంతరం వెనిగర్, కొబ్బరిపాలు, సగం మామిడి ముక్కలు వేసి పెద్ద మంటపై ఉడికించుకోవాలి. ముక్కలు ఉడుకుతన్నాయనగా సిమ్ లో పెట్టి మరో పావుగంట ఉడికించాలి. మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరపెట్టాలి.
ముక్కలు ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ లో కాస్త నూనె వేసి.. చికెన్ వేసి ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత.. మిగిలిన మామిడి ముక్కలు కూడా వేసి ఉడికించాలి.
రెండూ పూర్తిగా ఉడికిన తర్వాత.. ముందుగా పేస్టులా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో ఉంచి కాసేపు ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు, కారు సరిపడ వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే మ్యాంగో చికెన్ రెసిపీ రెడీ.. దీనిని అన్నం, రోటీలలో కూడా తింటే చాలా బాగుంటుంది.
గ్రేవీ ఎక్కువగా రావాలి అనుకుంటే.. టామాట కూడా వేసుకోవచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే.. లుక్ కూడా అదిరిపోతుంది.

Latest Videos

click me!