థైరాయిడ్ ఉన్నవారు ఏం తినాలో తెలుసా?

First Published | Sep 22, 2024, 11:21 AM IST

థైరాయిడ్ గ్రంథిలో సమస్యల వల్ల వచ్చే వ్యాధిపేరే థైరాయిడ్. కానీ ఈ వ్యాధి ఉన్నవారు ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలు థైరాయిడ్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. 
 

డయాబెటీస్ తో పాటుగా థైరాయిడ్ కూడా ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ వ్యాధి మగవారికంటే ఆడవారికే ఎక్కువగా వస్తుంది. థైరాయిడ్ ఏ వయసు వారికైనా రావొచ్చు. కానీ ఈ వ్యాధి వల్ల శరీరం ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతుంది.

ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి వల్లే ఈ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు రెగ్యులర్ గా మందులను వాడటంతో పాటుగా మంచి పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. అలాగే జీవనశైలిని మెరుగ్గా ఉంచుకోవాలి. 
 

మన శరీరానికి ఏ సమస్య వచ్చినా అది నయం కావడానికి మన శరీరానికి శక్తిని, పోషణను అందించే ఆహారం చాలా అవసరం. ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలను మీరు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే థైరాయిడ్ ను తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ ను అదుపులో ఉంచే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


పచ్చి కొబ్బరి

థైరాయిడ్ ఉన్నవారికి పచ్చి కొబ్బరి మంచి మేలు చేస్తుంది. ఇది థైరాయిడ్ ను అదుపులో ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు పచ్చి కొబ్బరిని మీ ఆహారంలో ఏవిధంగానైనా చేర్చుకోవచ్చు. దీనిని పచ్చిగా లేదా చట్నీ లేదా లడ్డూ వంటి ఎన్నో రూపాల్లో తినొచ్చు. పచ్చి కొబ్బరిని తింటే మీ మెటబాలిజం సక్రమంగా ఉంటుంది. శరీరం కూడా హెల్తీగా ఉంటుంది. 
 

amla

ఉసిరికాయ

ఉసిరికాయలో విటమిన్ -సి పుష్కలంగా ఉంటుంది. ఈ ఉసిరికాయ థైరాయిడ్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. థైరాయిడ్ కంట్రోల్ లో ఉండటానికి ఉసిరి పొడిని తేనెతో కలిపి ఉదయాన్నే తినండి. లేదా గోరువెచ్చని నీళ్లలో ఉసిరిపొడిని వేసి తాగండి. ఉసిరిని తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి అదుపులో ఉంటుంది. 

ఆపిల్ 

ఆపిల్ పండ్లు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. ఫైబర్ కంటెంట్, పెక్టిన్ పుష్కలంగా ఉండే ఆపిల్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం బాగా నిర్విషీకరణ చెందుతుంది. అంతేకాదు ఇది థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
 

గుడ్లు

రోజూ ఒక గుడ్డును తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. గుడ్లలో ట్రిప్టోఫాన్, టైరోసిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. గుడ్లను రోజూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుడ్లలో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ  మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

గుమ్మడికాయ గింజలు

గుమ్మడి గింజలు థైరాయిడ్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. గుమ్మడిగింజలను రోజూ తింటే థైరాయిడ్ ను అదుపులో ఉంటుంది. ఎందుకంటే గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా ఉత్పత్తి కావడానికి సహాయపడతాయి. 
 

Latest Videos

click me!