థైరాయిడ్ పేషెంట్లు వీటిని తింటే మంచిది

First Published | Jun 17, 2023, 1:10 PM IST

హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంధి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. 
 

థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఇది మన శరీర పెరుగుదల, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి లోపాల వల్ల థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు బాగా తగ్గుతాయి లేదా పెరుగుతాయి. హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే పరిస్థితి. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ హార్మోన్లు పెరిగినా ఇబ్బందే.. తగ్గినా ఇబ్బందే. అయితే ఈ హార్మోన్లను సమతుల్యంగా ఉంచేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అవేంటంటే.. 
 

పిస్తా

పిస్తా థైరాయిడ్ రోగులకే కాదు ప్రతి ఒక్కరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పిస్తాలో ఫైబర్, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి  థైరాయిడ్ రోగులు తినగలిగే ఆహారాలలో ఒకటి. వీటిని తింటే థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.


గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లో ఎన్నో  ఔషదగుణాలుంటాయి. గుమ్మడికాయ విత్తనాలు జింక్ కు గొప్ప మూలం. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాల శోషణకు, రీరంలో థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ, సమతుల్యతకు సహాయపడుతుంది. కాబట్టి గుమ్మడి గింజలు థైరాయిడ్ రోగులు తినదగినవి.

dates

ఖర్జూరాలు

ఖర్జూరాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయోడిన్, ఐరన్ సమృద్ధిగా ఉండే ఖర్జూరాలు థైరాయిడ్ హార్మోన్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి రక్తహీనత సమస్యను పోగొడుతాయి. కానీ వీటిని మోతాదులోనే తినాలి. 

Pulses

పప్పుధాన్యాలు

పప్పుధాన్యాల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే పప్పుధాన్యాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి త్వరగా బరువు పెరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి. థైరాయిడ్ రోగులు కూడా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.
 

Image: Getty Images

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె జుట్టుకే కాదు మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కొబ్బరి నూనె హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే హైపర్ థైరాయిడిజం ఉన్నవారు కొబ్బరి నూనెను వారి ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
 

amla

ఉసిరికాయ

ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయను థైరాయిడ్ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదం తప్పుతుంది.

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. థైరాయిడ్ రోగులు పాలు, వెన్న, పెరుగు వంటి అన్ని పాల ఉత్పత్తులను పుష్కలంగా తీసుకోవచ్చు.

Latest Videos

click me!