పాలతో ఏం తినాలి? ఏం తినకూడదు?

First Published | Jun 1, 2024, 4:24 PM IST

ప్రతి ఏడాది జూన్ 1 న ప్రపంచ పాల దినోత్సవాన్ని  జరుపుకుంటారు. పాలను తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ పాలతో పాటుగా ఏం తినాలి? ఏం తినకూడదో చాలా మందకి తెలియదు. దీనివల్లే చాలా మంది పాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. 


చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజూ ఒక గ్లాస్ పాలను తాగాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. ఎందుకంటే పాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలలో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే పాలతో పాటు ఏం తినాలి? ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

పాలతో తినాల్సినవి

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ ను పాలలో కలిపి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో బాదం, అంజీర, ఎండుద్రాక్ష, ఖర్జూరం కలుపుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో ఐరన్, క్యాల్షియం పోతుంది. 
 


అరటిపండు

అరటిపండును పాలతో పాటుగా తినొచ్చు. ఇలా తినడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. పాలలో ఐరన్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి పుష్కలంగా పోషణను అందిస్తుంది.

ఓట్స్ లేదా ఓట్ మీల్

పాలతో ఓట్స్ లేదా ఓట్ మీల్ ను కూడా తినొచ్చు. దీనిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అలాగే ఈ రెండింటి కాంబినేషన్ మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. 
 

పాలతో తినకూడనివి

స్పైసీ ఫుడ్

పాలతో స్పైసీ, స్పైసీ ఫుడ్ ఐటమ్స్ ను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. పాలను తాగేటప్పుడు ఏదైనా కారంగా తినాలనుకుంటే అది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలను కలిగిస్తుందని గుర్తుంచుకోండి. 
 

ఎక్కువ ప్రోటీన్ ఆహారాలు

పాలతో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే మీకు అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయి. 
 

సిట్రస్ పండ్లు

అరటిపండు లేదా ఆపిల్ పండును పాలతో కలిపి తింటే ఫర్వాలేదు. కానీ సిట్రస్ పండ్లు తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య కనీసం గంట గ్యాపైనా ఉండేట్టు చూసుకోండి. 

Latest Videos

click me!