ఫైబర్ మన శరీరానికి చాలా చాలా అవసరం. ఇది బరువు తగ్గడానికి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికే కాకుండా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కానీ మైదాలో ఫైబర్ కంటెంట్ కొంచెం కూడా ఉండదు. అందుకే పరోఠాను ఎక్కువగా తినేవారికి మలబద్దకం సమస్య ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట పరోటాను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.