చికెన్ తో పెరుగు తినకూడదా?

First Published | Jun 2, 2024, 2:15 PM IST

చికెన్ మంచి పోషకాహారం. వారంలో రెండు మూడు సార్లు తినేవారు కూడా ఉన్నారు. అయితే చికెన్ తింటున్నప్పుడు కొన్ని ఆహారాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

మటన్ కంటే చికెన్ నే చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే చికెన్ అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ కర్రీ అంటూ ఎన్నో రకాలుగా దీన్ని తింటుంటారు. నిజానికి చికెన్ టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. చికెన్ మంచి పోషకాల బాంఢాగారం. ఇది మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు అందిస్తుంది. 

కానీ చికెన్ ను మరీ ఎక్కువగా తినకూడదు. దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు చికెన్ ను తింటునప్పుడు కొన్ని రకాల ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.  ముఖ్యంగా ఇది శరీరంలో అలెర్జీలు , ప్రతిచర్యలకు కారణమవుతుంది. అంతేకాకుండా ఇది తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది. అందుకే చికెన్ ను తింటున్నప్పుడు ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


పాలు

చికెన్ తో పాలు తాగడం విషంతో సమానమంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ రెండూ కలిసి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల దద్దుర్లు, తెల్లని మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి. అందుకే చికెన్ ను తిన్న వెంటనే పాలను తాగకండి.
 


చేపలు

చికెన్ తినేటప్పుడు చేపలను తినేవారు కూడా ఉన్నారు. కానీ ఇలా చికెన్ ను తింటూ చేపలను  తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ ఇవి వివిధ రకాల ప్రోటీన్లు. ఈ రెండూ కలిస్తే అది శరీరానికి హానికరం.

పెరుగు

కొంతమంది చికెన్ తో పాటుగా పెరుగు తినడాన్ని బాగా ఇష్టపడతారు. కానీ పెరుగు చల్లగా, చికెన్ వేడిగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని తింటే ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
 

Latest Videos

click me!