కడిగి ఆరబెట్టిన కొత్తిమీరను గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. ఇలా చేస్తే ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.
పేపర్ టవల్‌లో చుట్టి నిల్వ చేస్తే కొత్తిమీరలో తేమ నిలిచిపోకుండా ఉంటుంది. తేమ ఉంటే అది త్వరగా పాడవడానికి కారణమవుతుంది.
ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు తీసుకుని, అందులో కొత్తిమీర కాడలను ముంచి పెట్టాలి. ఆకుల భాగాన్ని ప్లాస్టిక్ కవర్‌తో చుట్టడం మర్చిపోవద్దు.
నీటిలో పెట్టి నిల్వ చేసినప్పుడు కొత్తిమీరలో ఎప్పుడూ తేమ ఉంటుంది. ఇది కొత్తిమీర పాడవకుండా నివారిస్తుంది.
తడి క్లాత్ లో కొత్తిమీరను చుట్టి నిల్వ చేయవచ్చు. తర్వాత దీన్ని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది.
కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసి ఐస్ ట్రేలో వేసి ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు.
కొత్తిమీరను బాగా ఎండబెట్టి కూడా నిల్వ చేయవచ్చు. ఎండిన కొత్తిమీరను ఒక డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది.
Ghee: చలికాలంలో నెయ్యి ఎందుకు తినాలి?
కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?
పరగడుపున నానపెట్టిన మెంతులు తీసుకుంటే ఏమౌతుంది?
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు