విరాట్ కోహ్లీ ఏం తింటాడు? ఏం తినడు?

First Published | Jun 2, 2024, 1:28 PM IST

విరాట్ కోహ్లీ ఎంత ఫిట్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ ఫిట్ నెస్ వెనుక ఎంతో కష్టం ఉందంటారు కోహ్లీ. ముఖ్యంగా ఈ స్టార్ ప్లేయర్ ఫుడ్ విషయంలో అస్సలు తగ్గనే తగ్గరు. ఆరోగ్యానికి మేలు చేసే వాటినే తింటారు. అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాల జోలికి అసలే వెళ్లరు. అసలు ఈ స్టార్ క్రికెటర్ ఏం తింటారు? ఏం తినరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ గురించి అందరికీ తెలుసు. తను ఫిట్ గా ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఈ స్టార్ క్రికెటర్ తీసుకునే శ్రద్ద అంతా ఇంతా కాదు. కోహ్లీ తను తినే ఆహారాల గురించి చాలా ఓపెన్ గా కూడా చెప్పేస్తుంటారు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో కోహ్లీ తన కఠినమైన ఆహార నియమాల గురించి ఎన్నో విషయాలను వెళ్లడించారు. 

సరైన ఆహారాన్ని తీసుకుంటేనే జిమ్ లో కష్టపడి పనిచేయొచ్చని విరాట్ అంటాడు. కానీ ఆహారాన్ని మార్చడం అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నోటికి నచ్చినవి తినాలనుకుంటారు. వీటిని కాదని రుచిలేని ఒకేరకమైన ఆహారాలను తినడమంటే కష్టమైన పని. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఫుడ్ విషయంలో చాలా నిబద్ధతగా ఉంటారట. విరాట్ మాట్లాడుతూ "నేను రాబోయే ఆరు నెలలు, రోజుకు మూడుసార్లు ఒకే ఆహారాన్ని తినగలను. నాకేం ప్రాబ్లమ్ లేదని అన్నారు.


విరాట్ కోహ్లీ ఎక్కువగా ఉడకబెట్టిన ఆహారాలను మాత్రమే తింటాడు. అయితే ఇతను అప్పుడప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా ఇతర మసాలా దినుసులతో చేసిన పాన్ గ్రిల్స్ వంటకాలను కూడా తింటాడట. వేయించిన లేదా వేడిగా ఉండే ఆహారాలకు కోహ్లీ దూరంగా ఉంటాడు. ఇతను సాధారణంగా రాజ్మా, పప్పు, లోబియా కూడా తింటాడు. విరాట్ కోహ్లీ మసాలా వంటకాలకు చాలా దూరంగా ఉంటాడు.
 

విరాట్ కోహ్లీ తన డైట్ లో ఎక్కువగా తాజా కూరగాయలను చేర్చుతారు. ఇవి అతనికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. అలాగే ఇది భోజనాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. మీకు తెలుసా? కోహ్లీకి కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే కోహ్లీ సాధారణంగా రోజుకు రెండు కప్పుల కాఫీని తాగుతాడు. విరాట్ శుద్ధి చేసిన లేదా ఎక్కువ చక్కెర ఉన్న పానీయాలకు దూరంగా ఉంటాడు. పోషకమైన కార్బోహైడ్రేట్ల కోసం విరాట్ మొలకలు, సలాడ్లు, స్మూతీలను తీసుకుంటాడు. 

కోహ్లీ బచ్చలికూర, క్వినోవా, ఆకుకూరలు పుష్కలంగా తింటాడు. ఇతను తినే ఉడకబెట్టిన ఆహారంలో నిమ్మరసం, ఉప్పు, మిరియాలు వంటివి ఉంటాయి. ఈ స్టార్ క్రికెటర్ ఎక్కువగా రకరకాల ఆకుకూరలు, బియ్యం వంటకాలను, కాయధాన్యాలను తింటాడు.అలాగే ఇతను ఎక్కువగా సాధారణ వంటకాలనే బాగా ఇష్టపడతాడు. మీకు తెలుసా? విరాట్ కోహ్లీ అపుడప్పుడు దోషలు కూడా తింటాడు. కానీ తరచుగా మాత్రం తినరు. మధ్యాహ్న భోజనం మాదిరిగానే విరాట్ కోహ్లీ డిన్నర్ లో గ్రిల్డ్ వెజిటేబుల్స్ ను బాగా తింటారని టెస్ట్ సిరీస్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తో చెప్పాడు.
 

విరాట్ కోహ్లీ ఏయే ఆహారాలను తినరు

విరాట్ కోహ్లీ వేయించిన ఆహారాలను, కూరలను తినరు. అలాగే మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉంటారు. మనీ కంట్రోల్ ప్రకారం.. అతను శాకాహారిగా మారినప్పటి నుంచి విరాట్ పాలను తీసుకోవడం తగ్గించాడు. చక్కెరను కూడా తగ్గించాడు. 

Latest Videos

click me!