మనలో చాలా మంది పగలంతా కష్టపడుతూనే ఉంటారు. అంత కష్టపడినప్పుడు రాత్రిపూట అలసిపోయి నిద్రపడితే ఎంత హాయిగా ఉంటుంది. కానీ కొందరి విషయంలో అది జరగదు. పగలంతా కష్టపడినా కూడా.. ఒత్తిడి, లేదా ఇతర సమస్యల కారణంగా సరిగా నిద్రపట్టదు. మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతున్నారా? అయితే.. పడుకోగానే నిద్రపట్టాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.
ప్రతి మనిషికి మంచి నిద్ర చాలా అవసరం. ఎందుకంటే మంచి నిద్ర మనకు మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాంటి నిద్ర కావాలి అంటే.. మనం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుందట. కొన్ని రకాల ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మంచి నిద్ర సొంతమౌతుందట.
మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది.. ఆహారం జీర్ణమవ్వడానికి సహాయపడటంతో పాటు.. మంచి నిద్రకు కూడా ఉపక్రమిస్తుంది.
అంతేకాదు.. మీరు తీసుకునే ఆహారంలో షుగర్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. షుగర్ ఫుడ్స్ తక్కువగా తీసుకున్నప్పుడే.. మంచి నిద్ర సొంతమౌతుంది.
అంతేకాకుండా... విటమిన్ బి6 పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. విటమిన్ బి6 శరీరానికి రిలాక్సేషన్ అందించే హార్లోన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి నిద్ర రావడానికి కారణం అవుతాయి.
అరటిపండు తిన్నా కూడా.. మంచి నిద్ర సొంతమౌతుంది. ఎందుకంటే అరటి పండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.. ఇది కూడా నిద్రకు అవసరమయ్యే హార్మోన్ ని విడుదల చేస్తుంది. దీని వల్ల.. ప్రశాంతమైన నిద్ర సొంతం అవుతుంది.