యాలకులను మనం ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తాం. ఇది కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాకుండా.. మన ఆరోగ్యానికి మేలు చేసే దివ్య ఔషదం కూడా. యాలకుల్లో విటమిన్ బి6, విటమిన్ బి3, విటమిన్ సి, జింక్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే చాలా మంది యాలకులను టేస్ట్ కోసం, మంచి సువాసన కోసం టీలో వేస్తుంటారు. కానీ ఈ టీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు. యాలకులు వేసిన టీని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.