బీపీ, డయాబెటిస్, బరువును తగ్గించే ఫుడ్స్
ఆకుకూరలు
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బచ్చలికూర మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. దీనిలో విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ కె, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం కూడా మెండుగా ఉంటాయి.
ఈ ఆకు కూరను తింటే మీ శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కూరలో ఉండే ఫైబర్, వాటర్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సమాయపడతాయి. బచ్చలి కూరలో ఉండే నైట్రేట్ అనే సమ్మేళనం బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే రిస్క్ తగ్గుతుంది. అలాగే బచ్చలి కూరలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటుంది.