ginger garlic
ఇంటి నుంచి చిన్నా, పెద్ద రెస్టారెంట్ల వరకు.. చాలా రకాల ఆహారాల్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను ఖచ్చితంగా వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫుడ్ రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. చాలా మంది అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను వేసిన దాకా వంట చేయనే చేరు.
ginger garlic
టేస్ట్ కోసం వాడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అల్లం, వెల్లుల్లి రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి.
అల్లం దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి బరువును తగ్గించడం నుంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం వరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ginger garlic
ఆరోగ్యానికి మేలు
అల్లం, వెల్లుల్లి పేస్టును మనం ప్రతి కూరలో వేస్తాం. అలాగే బిర్యానీలో కూడా ఖచ్చితంగా వాడుతాం. ఈ ఈ పేస్ట్ ఆహారాన్ని మరింత టేస్టీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ
అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ జీర్ణశయాంతర సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణసమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ginger garlic
స్త్రీలకు మేలు
అల్లం, వెల్లుల్లి పేస్టును మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆడవాళ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అవును ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవడం వల్ల ఆడవారికి తలనొప్పి, నెలసరి తిమ్మిరి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
మన శరీర రోగనిరోధక శక్తి ఎంత తక్కువగా ఉంటే మీకు అన్ని ఎక్కువ రోగాలు వస్తాయి. అయితే రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. అల్లం, వెల్లుల్లి పేస్టును ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఇది సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తిని మీ శరీరానికి అందిస్తుంది.
ginger garlic
అంటువ్యాధులు, వ్యాధుల నుంచి రక్షణ
అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు కొంతమందికి ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇవి అంత తొందరగా తగ్గవు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పేస్ట్ లో ఉండే లక్షణాలు మీకు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ మీరు బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే దీన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. ఈ పేస్ట్ ను తీసుకుంటే కేలరీలు కరుగుతాయి. అలాగే ఆకలి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ginger garlic
గుండెకు మేలు
ఈ రోజుల్లో పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికీ గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.