వర్షాకాల వ్యాధులను దూరం చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి ఈ కూరగాయలను తినండి

First Published | Aug 17, 2023, 11:36 AM IST

ఈ సీజన్ లో లేనిపోని రోగాలు వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే ఈ వానాకాలంలో కొన్ని కూరగాయలను తింటే వర్షాకాల రోగాలు దూరమవ్వడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.

వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంది. అలాగే మన రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉంటుంది. అధిక తేమ, అనారోగ్య సమస్యలు, మురుగునీరు, భారీ వర్షాలతో తాగునీరు కలుషితం కావడం వల్ల  సూక్ష్మజీవులు పెరిగిపోతాయి. ఇది ఎన్నో రోగాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సీజన్ లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా, బలమైన రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. నిపుణుల ప్రకారం.. వానాకాలంలో కొన్ని కూరగాయలను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బచ్చలికూర

బచ్చలికూర మంచి పోషకాలున్న కూరగాయ. ఈ ఆకు కూరలో ఇనుము, ఫోలేట్ వంటి ఖనిజాలతో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయ. ఈ పోషకాలు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఆరోగ్యకరమైన కణాల పనితీరుకు సహాయపడతాయి. ఇవి మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ బచ్చలికూర సలాడ్లు, సూప్లు లేదా స్మూతీలకు జోడించొచ్చు. 
 


రెడ్ బెల్ పెప్పర్స్

రెడ్ క్యాప్సికం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కూరగాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాదు రెడ్ క్యాప్సికంలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడానికి సహాయపడతాయి. అలాగే మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 
 

బ్రోకలీ

క్రూసిఫరస్ కూరగాయ అయిన బ్రోకలీ విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ కు మంచి మూలం. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.  అలాగే అంటువ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే రోగనిరోధక పనితీరుకును కూడా మెరుగుపరుస్తుంది. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం రోగనిరోధక ప్రతిస్పందనలను మెరుగుపరుస్తుంది. మంటను తగ్గిస్తుంది. 
 

క్యారెట్లు

క్యారెట్లను రెగ్యులర్ వంటల్లో ఉపయోగించే వారు చాలా మందే ఉన్నారు. ఇవి రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తాయి. దీనిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తిన్నప్పుడు మన శరీరం విటమిన్ ఎగా మార్చుతుంది. క్యారెట్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా శరీరం పోరాడటానికి సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఎ, తెల్ల రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. ఇవి రోగనిరోధక ప్రతిస్పందనకు చాలా అవసరం. 

కాకరకాయ

చాలా మంది కాకరకాయను అస్సలు తినరు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుందని. నిజానికి ఈ కాకరకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే దీనిలోని విటమిన్లు, ఖనిజాల అధిక సాంద్రత కారణంగా ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Okra

బెండకాయ

బెండకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని బలంగా చేయడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ కూరగాయను వర్షాకాలంలో ఖచ్చితంగా తినాలి. విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న బెండకాయ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దీనిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక ప్రతిస్పందనను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

Latest Videos

click me!