కడుపు ఉబ్బరం భరించలేకపోతున్నారా? ఇలా చేస్తే సమస్య మటాష్!

Published : Jan 25, 2025, 10:39 AM IST

కడుపు ఉబ్బరం అనేది చాలామందిని వేధించే జీర్ణక్రియ సమస్య. ఆ బాధ వర్ణనాతీతం. ఇది గ్యాస్, అజీర్ణం లేదా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కలుగుతుంది. ముఖ్యంగా బీన్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్, కొన్ని కూరగాయలు, పాల ఉత్పత్తులు, గోధుమలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉబ్బరం కలిగిస్తాయి. ఈ సమస్య నుంచి బయట పడటం ఎలా అంటే..

PREV
16
కడుపు ఉబ్బరం భరించలేకపోతున్నారా? ఇలా చేస్తే సమస్య మటాష్!
కడుపు ఉబ్బరం

ఉబ్బరం: ఒక సాధారణ జీర్ణ సమస్య. మనలో 30% మంది గ్యాస్, అజీర్ణంతో బాధ పడుతుంటారు. దీన్ని తగ్గించుకోవాలంటే ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే..
26
కార్బోనేటేడ్ పానీయాలు

సోడా, శీతల పానీయాలు, బీర్, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ నింపిన నీరు అధికంగా తీసుకోవద్దు. ఇవి జీర్ణవ్యవస్థలో చేరడంతో గ్యాస్ తయారవుతుంది. కొన్నిసార్లు పొట్టలో తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది.
36
కూరగాయలు

బ్రోకలీ, కాలీఫ్లవర్.. ఇవి ఆరోగ్యకరమైనవే అయినా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. బాగా ఉడికించి తినకపోతే జీర్ణం అవడం కష్టం. 
46
పాల ఉత్పత్తులు

పాలు, చీజ్ అందరికీ పడవు. లాక్టోస్ ఉత్పత్తులు సరిగా జీర్ణంకాక అధికంగా అపానవాయువును కలిగిస్తాయి. వీటిని పరిమితంగా వాడటం లేదా ప్రత్యామ్నాయం చూసుకోవడం చేయాలి.
56
గోధుమ & గ్లూటెన్

గోధుమ, గ్లూటెన్ ఉత్పత్తులతో కడుపు ఉబ్బరం ఎక్కువ అవుతుంది. స్థాయికి మంచి తింటే ఇవి జీర్ణం అవడం కష్టం. పరిమితిగా తీసుకోవాలి.
66
ఉల్లిపాయ & వెల్లుల్లి

ఉల్లి, వెల్లుల్లిలో ఫ్రక్టాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాడటం వల్ల ఆహారానికి రుచి పెరుగుతుంది కానీ అత్యధికం వాడకం మంచిది కాదు. ఇవి త్వరగా జీర్ణం కావు. తప్పనిసరి అనుకుంటే బాగా ఉడికించి తినాలి లేదా ప్రత్యామ్నాయం చూసుకోవాలి.
click me!

Recommended Stories