ఈ ఫుడ్స్ తింటే ఎత్తు పెరుగుతారు..!

First Published | Jul 19, 2023, 12:22 PM IST

ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇవి ఎత్తు పెరగడానికి కూడా ఉపయోగపడతాయి.

మనలో చాలా మంది ఎత్తు, బరువు విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు బరువు ఎక్కువగా ఉన్నామని ఫీలౌతుంటే, మరి కొందరు బరువు పెరగడం లేదని బాధపడుతూ ఉంటారు. మరి కొందరు ఎత్తు పెరగడం లేదని బాధపడుతుంటారు. అయితే, వీటన్నింటికీ మనం తీసుకునే ఆహారమే కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల  సులభంగా ఎత్తు పెరుగుతారట. ముఖ్యంగా పిల్లలకు ఈ ఆహారాలు పెడితే, ఎత్తు పెరుగుతారట. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

1.బాదం పప్పు..
బాదం పప్పు లో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ఎంతో సహాయపడుతుంది. వీటిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, అందులో ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం కూడా ఉంటాయి.


2.స్వీట్స్ పొటాటోస్..
స్వీట్ పొటాటోస్ చూడటానికి కలర్ ఫుల్ గా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇవి ఎత్తు పెరగడానికి కూడా ఉపయోగపడతాయి.
 

eggs

3.కోడిగుడ్లు..
కోడి గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి కూడా పిల్లలో ఎత్తు పెరగడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే, పిల్లలకు ప్రతి రోజూ గుడ్లు ఆహారం లొ భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


4.బీన్స్..
బీన్స్ లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల , ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. పిల్లల ఎదుగుదలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
 

5.పెరుగు..
పెరుగులో సైతం ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా  పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగు తయారు కావడానికి ఉపయోపడే బ్యాక్టీరియా ఆరోగ్యానికి చాలా ఎక్కువ సహాయపడుతుంది. ఇది పిల్లల ఎత్తు పెరగడంలో కీలకంగా పని చేస్తుంది.
 

6.చికెన్..

చికెన్ లో ప్రోటీన్ చాలా హైగా ఉంటుంది. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా,  న్యూట్రియంట్స్, విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, ఇది కూడా పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.
 

leafy vegetables

7. ఆకు కూరలు..

ఈ మధ్యకాలం పిల్లలు ఆకుకూరలను చాలా ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ,  ఆకు కూరల్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి కూడా మనకు ఎత్తు పెరగడానికి చాలా ఎక్కువగా సహాయం చేస్తాయి.

Image: Getty

8.కినోవా..
చాలా మంది ఈ మధ్య కినోవాని బరువు తగ్గడానికి ఉపయోగిస్తున్నారు. కానీ, ఇది ఎత్తు పెరగడానికి కూడా కీలకంగా పని చేస్తుంది. దీనిలో మాంగనీస్, పాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముక  బలానికి ఎంతో సహాయం చేస్తాయి.

Latest Videos

click me!