రాత్రి 8 తర్వాత ఇవి తింటే.. బరువు తగ్గడం ఖాయం..!

First Published | Mar 5, 2024, 2:37 PM IST

 ఈ కింది ఫుడ్స్  రాత్రి 8 తర్వాత తిన్నా కూడా.. సులభంగా బరువు తగ్గవచ్చట. మరి.. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

Bitter food

ఈ మధ్యకాలంలో బరువు తగ్గేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ బరువు తగ్గే క్రమంలో చాలా మంది తిండి మానేయడం  లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాదు.. రాత్రి 8 తర్వాత.. ఎలాంటి  ఆహారం తీసుకోకుండా ఉంటే.. సులభంగా బరువు తగ్గవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. దీనిని ఫాలో అవుతున్న వారు కూడా ఉన్నారు. ఇది నిజమే. కానీ... ఈ కింది ఫుడ్స్  రాత్రి 8 తర్వాత తిన్నా కూడా.. సులభంగా బరువు తగ్గవచ్చట. మరి.. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

soaked almonds


1.నానపెట్టిన బాదం..

నానపెట్టిన బాదం పప్పు ఆరోగ్యానికి మంచిది  అనే విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువగా రాత్రిపూట వీటిని నానపెట్టి.. ఉదయాన్నే తింటూ ఉంటారు. కానీ...  వీటిని రాత్రి 8 తర్వాత కూడా హాయిగా తినొచ్చు. వీటిని రాత్రిపూట తినడం వల్ల.. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. మజిల్స్ పెరుగుతాయి. వీటిలో ఫ్యాట్ తక్కువగా.. న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి.

Latest Videos


eggs

2.కోడిగుడ్డు..
కోడిగుడ్డును రాత్రిపూట తినడం వల్ల.. శరీరానికి ప్రోటీన్ అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, పాస్పరస్, విటమిన్ బి12, విటమిన్ బి6 ఉంటాయి. ప్రశాంతంగా రాత్రి 8 తర్వాత కూడా  తినొచ్చు.

peanut butter


3.పీనట్ బటర్..
పీనట్ బటర్ లో  ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి... ఎలాంటి భయం లేకుండా తినేయవచ్చు. అయితే.. రాత్రి 8 తర్వాత  పీనట్ బటర్  తినొచ్చు. రాత్రి తినడం వల్ల.. మంచి నిద్ర కూడా పడుతుంది. 

Yogurt

4.యోగర్ట్..
రాత్రి 8 తర్వాత  యోగర్ట్ ని ఎలాంటి అనుమానాలు లేకుండా తినొచ్చు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిలో క్యాలరీలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మజిల్ గ్రోత్ పెరగడానికి సహాయపడుతుంది.

oats


5.ఓట్స్..
ఓట్స్ తో  మనకు చాలా రెసీపీలు చేసుకోవచ్చు. ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ దోశ, ఓట్స్ ఉప్మా, ఇలా ఏదో ఒకటి చేసుకొని తినవచ్చు. ఓట్స్ ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.

Brown Bread


6.బ్రౌన్ బ్రెడ్..
వైట్ బ్రౌడ్ తో పోలిస్తే... బ్రౌన్ బ్రెడ్  ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫ్యాట్ బర్న్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి.. రాత్రి తర్వాత కూడా తినొచ్చు.
 

banana


7.అరటిపండ్లు..
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా.. రాత్రిపూట అరటిపండు తినడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది.

click me!