ఆయుర్వేదం అనేది ఒక పురాతన వైద్య శాస్త్రం, ఇది మనం ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు..? ఎలాంటి ఆహారం తీసుకోకూడదో వివరిస్తుంది. అయితే... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొన్ని ఆహారాలను కూడా అందరూ తినకూడదట. కేవలం కొందరు మాత్రమే తినాలి. అలాంటివాటిలో అవిసె గింజలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ వీటిని ఎవరు తినాలో.. ఎవరు తినకూడదో ఓసారి చూద్దాం...
అవిసె గింజలు: అవిసె గింజలలో (Flax seeds) క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల (Hormones) ఉత్పత్తిని మెరుగుపరిచి గుండె సమస్యలు తగ్గుతాయి. మెదడు పనితీరును, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యానికి సహాయపడతాయి. ఒక స్పూన్ గింజలను సగం కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే ఆరోగ్యంతో పాటు అందం కూడా మంచిది.
02/5 అవిసె గింజలు ఎందుకు ముఖ్యమైనవి?
అవిసె గింజలు మంచి ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అంతేకాదు.. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. మెదడు శక్తి కూడా పెరుగుతుంది. అందువల్ల.. వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. ఈ విత్తనాలలో ఒమేగా-3, ఒమేగా-6 పుష్కలంగా ఉంటాయి. ADHD, హైడర్‌టెన్షన్ , అల్జీమర్స్ వంటి వ్యాధులను కూడా నయం చేయగలవు.
ఎందుకు అతిగా తినకూడదు?
ఆయుర్వేదం ప్రకారం, అవిసె గింజలను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి వేడి స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి అతిగా తీసుకోవడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిని అతిగా కాకుండా మితంగా తీసుకోవడం ఉత్తమం.
మలబద్ధకం సమస్యలను తగ్గిస్తాయి: అవిసె గింజలలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి పేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరిచి మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడతాయి. దీంతో మలబద్దకం సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
వీటిని ఎవరు తినాలి?
ఆయుర్వేదం ప్రకారం, పోషకాహార లోపం, ఎముకలు & కీళ్ల నొప్పులు, బలహీనత, పీరియడ్స్ సమయంలో తక్కువ ప్రవాహం వంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ విత్తనాలను తమ ఆహారంలో తీసుకోవాలి. ఈ గింజలు వెచ్చగా ఉండే స్వభావాన్ని కలిగి ఉన్నందున, ఇటువంటి సమస్యలన్నింటికీ ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అలాగే, మీరు ఎప్పుడైనా డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటే, మీరు ఈ విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. బరువు తక్కువగా ఉండేవారు కూడా వీటిని తీసుకోవడం ఉత్తమం.
flax seeds
వీటిని ఎవరు తినకూడదు..?
సీడ్ సైక్లింగ్ అని పిలువబడే ఈ అవిసె గింజలను అధికంగా తీసుకోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యత ఏర్పడుదుంది.అందువల్ల, మీరు అధిక ఋతుస్రావం, శరీరంలో అధిక వేడి, గర్భం ధరించడానికి ప్రయత్నించడం, తక్కువ లిబిడోతో పోరాడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు వీటిని తినకుండా ఉండటమే మంచిది.