ఈ ఫుడ్స్.. ఈ మెదడు ని చురుకుగా చేస్తాయి..!

First Published | Sep 9, 2022, 1:18 PM IST

మన శరీరంలోని ఇతర అవయవాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. మన బ్రెయిన్ కూడా అలానే చేసుకోవాలి. అందుకోసం మన బ్రెయిన్ ని చురుకుగా చేసే ఆహారాలు తీసుకోవాలి.

మనం ఏ పని చేయాలన్నా మన మెదడు సరిగా పనిచేయాల్సిందే. మన మొదడు ఆదేశాల మేరకే మనం ఏ పనైనా చేస్తాం. కాబట్టి.. మన శరీరంలోని ఇతర అవయవాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. మన బ్రెయిన్ కూడా అలానే చేసుకోవాలి. అందుకోసం మన బ్రెయిన్ ని చురుకుగా చేసే ఆహారాలు తీసుకోవాలి. అవేంటో ఓసారి  చూద్దాం..
 

Fish Fry

1.చేపలు..
మన మెదడుని చురుకుగా చేసి.. తెలివితేటలు పెరగాలి అంటే కచ్చితంగా చేపలు ఆహారంగా తీసుకోవాలి. ఇది బెస్ట్ ఫుడ్. దీనిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల... మెదడు చురుకుగా పని చేస్తుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. ఫోకస్ కూడా పెరుగుతుంది.


2.ఆకు కూరలు..

ఆకు కూరలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకు కూరల్లో విటమిన్ బీ కాంప్లెక్స్  ఉంటుంది. అంతేకాదు.. విటమిన్ సి, విటమిన్ ఈ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.  ఇవి కూడా మన మొదడు ఆరోగ్యంపై పనిచేస్తాయి. న్యూరో సిస్టమ్ సరిగా పని చేయడానికి సహాయం చేస్తాయి.

3.బ్రొకోలి...
బ్రొకోలి లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఫ్లావనాయిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా మన మెదడు పనితీరు సరిగా జరగడానికి సహాయపడతాయి.
 

4.అవకాడో...
అవకాడోలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా బ్రెయిన్ సరిగా పని చేయడానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయి,

5.బ్లూ బెర్రీస్..

బ్లూ బెర్రీస్ కూడా మెదడు ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి. వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ బ్లూబెర్రీస్ లో ఉండే యాక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తినడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తాయి.

egg

6.కోడిగడ్డు..

మనం తేలికగా తీసుకుంటాం కానీ.. కోడి గుడ్డు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రోటీన్ కి సరైన మార్గం. దీనిలో బి6, బి12 విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన మెమరీని పెంచడానికి సహాయం చేస్తాయి.

Latest Videos

click me!